తెలంగాణకు మహావిషం


Mon,November 19, 2018 03:35 AM

-నాడు ద్రోహులు-నేడు మిత్రులా
-అభివృద్ధిని అడ్డుకునే కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
-కోదండరాం ఏ ప్రాతిపదికన పొత్తులు పెట్టుకున్నారో చెప్పాలి
-వరంగల్ దశను మార్చుతున్నాం
-సంక్షేమ పథకాల్లో తెలంగాణదేశానికే ఆదర్శం
-మీట్ ది ప్రెస్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
న్యూశాయంపేట, నవంబర్18: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశం ఆశ్చర్యంపడే విధంగా అభివృద్ధి, సం క్షేమ పథకాలు అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్, టీఆర్‌స్ పార్టీకే దక్కుతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆ యన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పణంగా పెట్టిన, తెలంగాణ ప్రజల బాధలు తెల్సిన కేసీఆర్ న్యాయకత్వంలోనే రాష్ట్రం భద్రంగా ఉంటుందని భావించి ప్రజలు 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను దేశ ప్రధాని లోక్‌సభలో ప్రస్తావించారని గుర్తుచేశారు. రైతులు, నేతన్నలు, గీత కా ర్మికులు, వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్ర జనాభాలో 60 నుంచి 70 శాతం ఉన్న రైతులను రాజు చేయడానికి, వ్యవసాయా న్ని పండుగగా మార్చడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అన్నారు. తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరంట్ ఇచ్చిందని అన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొదటి విజయమని, రాష్ట్రంలోని పారిశ్రామిక, గృహావసరాలకు, ఇతర రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.

మహాకూటమి విషప్రయోగం
మహాకూటమి విఫల ప్రయోగం మాత్రమే కా దు, తెలంగాణకు విషప్రయోగం అని కడియం శ్రీహరి అభివర్ణించారు. భావ సారుప్యతలేని, సిద్ధాంత సామీప్యతలేని పార్టీలు కూటమి ఏ ర్పాటు కావడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీచేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మహాకూటమి పరిస్థితి చూస్తే జాలేస్తుందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఇ ప్పటికే రెండు దఫాలు ప్రచారం నిర్వహించి మూడోసారి ప్రచారం మొదలు పెడుతుంద న్నారు. కూటమి మాత్రం ఇప్పటి వరకు అ భ్యర్థులనే ప్రకటించలేదని అన్నారు. మహాకూటమి పేరుతో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెడితే కాళేశ్వరం, పాలమూర్ ప్రాజెక్ట్‌లను కట్టనిస్తాడా..? కాంగ్రెస్ నాయకులు స మాధానం చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఓటుతో కూటమికి బుద్ధిచెప్పాలని కోరా రు. అనంతరం డిప్యూటీ సీఎం కడి యం శ్రీహరిని ప్రెస్‌క్లబ్ కార్యవర్గం సన్మానించింది. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్ల బ్ అధ్యక్ష, కార్యదర్శులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఐజే యూ నాయకులు దాసరి కృష్ణారెడ్డి, టీయుడబ్ల్యూజే-143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, అర్బన్ జిల్లా కార్యదర్శి సుభాష్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా కార్యదర్శి కంకణాల సంతోష్, ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు, ప్రెస్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

రైతులకు అండగా..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రూ.17వేల పంట ఉణాలను మాఫీ చేసిందని డిప్యూటీ సీఎం అన్నారు. దీంతో 36 లక్షల మంది రైతులకు లాభం జరిగిందని అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఆధునిక వ్యవసాయ పరికరాలైన ట్రాక్టర్లు, హార్‌వేస్టర్లు సబ్సిడీతో అందజేస్తున్నామని అన్నారు. దేశ ంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పెట్టుబడికి ఎకరాకు రెండు పంటలకు ప్రభుత్వం రూ.8వేలు అందిస్తుందని అన్నారు. రైతు మరణిస్తే వారి కుంటుంబం వీధిన పడకుండా రూ.22 వందలు ప్రీమియం చెల్లించి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని అన్నారు. ఈ రకమైన రైతు సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవ ని కడియం శ్రీహరి పే ర్కొన్నారు.

ప్రాజెక్టుల నిర్మాణం..
తెలంగాణ రైతాంగానికి కోటి ఎకరాలకు సాగునీరు అం దించేందకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. కాళేశ్వరం, సీతారామ, దేవాదులు, వరదకాలువ, తదితర ప్రాజెక్టులను రూ.25వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పనులను త్వరగా పూర్తిచేస్తున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను చూసి సీడబ్ల్యూసీ సైతం ఆశ్చర్యపోయిందన్నారు. ప్రాజెక్ట్‌లు అపడానికి కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసిందని, కోర్టుల్లో అనేక కేసులు వేసిందని అన్నారు. రెండు సం వత్సరాల్లో దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కోటి ఎకరాలకు నీరు అందించి తీరుతామని అన్నారు. కాంగ్రెస్ హాయంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞనంగా మార్చారని ఆరోపించారు. వ రంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు అందిస్తామని అన్నారు. దేవాదులు మూడోదశ పనులు ముందుకు సా గుతున్నాయని అన్నారు. తూపాకులుగూడెం వద్ద 365 రోజులు నీ టిని పంపింగ్ చేసే విధంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని అన్నా రు. రూ.3220 కోట్లతో ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద రిజర్వాయర్‌ను మల్కాపూర్-లింగంపల్లిలో 10.78 టీఎంసీల నీటి ని లువ సామర్ధ్యం కల రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నామని అన్నారు.

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్..
ఉద్యమ సమయంలో పల్లెలు, తండాలు తిరుగుతున్న క్రమంలో ఒక తండాలో ఆడ పిల్ల పెళ్లికి దాచుకున్న డబ్బులు కాలిపోవడంతో ఉద్యమనేత కేసీఆర్ చూసి చలించారన్నా రు. బాధిత కుటుంబ పరిస్థితిని అర్థంచేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటింకపోయినప్పటికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకా న్ని ప్రవేశపెట్టారని అన్నారు. 2018 ఏప్రిల్ నుంచి రూ.లక్ష నూట పదహారు అందిస్తున్నారని అన్నారు. అప్పటి వరకు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన పథకాన్ని తెల్లరేషన్ కార్డు ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అందే విధంగా రూ పొందించామని అన్నారు.
కేసీఆర్ కిట్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని వి ధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం అన్నారు. దీనిలో భాగంగా కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆడ బిడ్డలను అదుకుంటున్నారని అన్నారు. పురిటి నొప్పులు ప్రాంభమైన వెంటనే 102కు కాల్ చేస్త్తే ఉచితంగా అంబులెన్స్ వచ్చి ఆడబిడ్డను ప్రభుత్వ అసుపత్రికి తీసుకువెళుతుందని అన్నారు. సుఖ ప్రసవం అనంత రం 17 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్, ఆడబిడ్డ అయితే రూ.13 వేలు, మగబిడ్డ అయితే రూ.12 ఇచ్చి, అదే 102 వాహనంలో ఇంటి దగ్గర భద్రంగా దింపుతుందని ఆయన అన్నారు.

డబుల్ బెడ్‌రూం ఇండ్లు..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత నిరుపేదలు తలెత్తుకొని జీవించే విధంగా డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించామని అన్నా రు. డబుల్‌బెడ్‌రూం విషయంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తమేనని అన్నారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపోవడం, సమయానికి కాంట్రాక్టర్లు ముం దుకు రాకపొవడంతో ఆలస్యం జరిగిందని అన్నారు. పేద వారికి తప్పనిసరిగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించి ఇస్తామని అన్నారు. రాబోవు కొత్త ప్రభుత్వంలో స్థలాలు ఉన్న వారికి రూ.5 లక్షలు ఇచ్చి, వారి సొంత స్థలాల్లో ఈ ఇండ్లు కట్టుకునే విధంగా ప్రణాళిక రూపొందించామని అన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడంలో కూడా జా ప్యం జరిగిందన్నారు. ఈ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని అన్నారు.

గురుకులాల ఏర్పాటు..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కేజీ టూ పీజీ వి ద్యలో భాగంగా పెద్దఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి 5 వ తరగతి నుంచి 12 తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల కాలంలో 3 వంద ల గురుకులాలు ఉండేవని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా 570 గురుకులాను ఏర్పాటు చేసిందని అన్నారు. ఎస్సీ, ఎ స్టీ బాలికల కోసం 53 గురుకుల డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని అన్నారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ని విద్యార్థులు సన్నబియ్యంతో కూడిన నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు.
హైదరాబాద్ గ్లోబల్ నగరం..
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గ్లోబల్ నగరమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు రాబట్టే విధంగా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు 15 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలన్నీ తమ అవుట్‌సైడ్ వ్యాపారాన్ని హైదరాబాద్‌లోనే ప్రారంభిస్తున్నాయని కడియం తెలిపారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...