నేటితో ముగియనున్న నామినేషన్ల ఘట్టం..


Mon,November 19, 2018 03:32 AM

-6వ రోజు వరకు 52 నామినేషన్లు దాఖలు
-చివరి రోజు పెరిగే అవకాశం
అర్బన్ కలెక్టరేట్, నవంబర్ 18: శాసనసభ ఎన్నికల సందర్భంగా నేటితో నామినేషన్ల దాఖలు చేసే ఘట్టం ముగియనుంది. సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే 12వ తేదీ నుంచి ప్రారంభమైన నామినేష ప్రక్రియలో ఆరో రోజు శనివారం వరకు మొత్తం 52 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజక వర్గం పరిధి(105)లో 19, వరంగల్ తూర్పు నియోజక వర్గం పరిధి(106)లో 25, వర్ధన్నపేట నియోజక వర్గం పరిధిలో 8 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో మొదటి రోజైన 12వ తేదీన వరంగల్ తూర్పు నియోజక వర్గానికి ఒకటి, రెండో రోజు మంగళవారం వరంగల్ తూర్పు నియోజక వర్గంలో రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో రోజైన బుధవారం 10 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నాల్గొ రోజు గురువారం వరంగల్ పశ్చిమ నియోజక వర్గానికి ఒకటి, వరంగల్ తూర్పు నియోజక వర్గానికి 4నామినేషన్లు దాఖలయ్యాయి. వర్ధన్నపేటలో ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. నాల్గొ రోజు వరకు వరంగల్ తూర్పు నియోజక వర్గంలో 4, వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో 5, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఒక్క నామినేషన్ దాఖలయ్యాయి. అలాగే ఐదవ రోజు వరంగల్ పశ్చిమ నియోజక వర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ రెండవ సెట్‌తో కలిపి 5, వరంగల్ తూర్పులో 2, వర్ధన్నపేటలో 2 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఆరో రోజు వరంగల్ తూర్పు నియోజక వర్గంలో 12 నామినేషన్లు(రెండవ సెట్లు కలిపి), వరంగల్ పశ్చిమలో 8, వర్ధన్నపేట నియోజక వర్గంలో 5 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, నేడు అభ్యర్థులందరూ మళ్లీ నామినేషన్లు వేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

188
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...