ఉద్యమ ఐక్యత..!


Sat,November 17, 2018 02:18 AM

వరంగల్, నమస్తేతెలంగాణ: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం నాటి ఐక్యత కనిపిస్తోంది. అదే స్ఫూర్తితో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్ శ్రేణులు కదులుతున్నా యి. నియోజకవర్గ పరిధిలోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లంతా ఒకే గొంతుకగా గెలుపు కోసం శ్రమించేందుకు సిద్ధ్దమయ్యారు. తూ ర్పు నియోజకవర్గంలో కొంత కాలంగా నెలకొన్న రాజకీయ పరిణామాలకు చెక్ పెట్టారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లే ఉండటం ఇక్కడ పార్టీకి పెద్ద బలంగా ఉంది. కార్పొరేటర్లంతా ప్రచార రంగంలోకి దూకేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు రోజుల క్రితం తూర్పు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థిని అధిష్ఠానం ప్రకటించిన నేపథ్యంలో త క్కువ సమయంలో పక్కా గెలుపు వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. రాజకీయ చైతన్యం కలిగిన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉద్యమస్ఫూర్తితో టీఆర్‌ఎస్ గెలుపుకోసం అడుగు లు వేస్తున్నారు. ఇప్పటికీ మహాకూటమి, బీజేపీ పార్టీల నుంచి అభ్యర్థుల ఖరారు కాకపోవడంతో ఆయా పార్టీల్లో రాజకీయ గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా, టీఆర్‌ఎస్ వ్యూహరచన చే స్తోంది. తక్కువ సమయంలోనే ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఏకతాటిపైకి..!
తూర్పు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లం తా ఏకతాటిపైకి వచ్చారు. పార్టీ గెలు పే లక్ష్యంగా ఏకమయ్యా రు. తూర్పు నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలన్న సం కల్పంతో ప్రచార పర్వంలోకి దూసుకుపోతున్నారు. పార్టీయే ముఖ్యమంటూ కార్పొరేటర్లంతా ఏకమై టీఆర్‌ఎస్ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తున్నారు. శనివారం తూర్పు నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ నామినేషన్ కార్యక్రమానికి అన్ని డివిజన్ల నుంచి శ్రేణులను తరలించేందుకు కార్యాచరణ రూ పొందించారు. నామినేషన్ మరుక్షణం నుంచే ప్రచార పర్వాన్ని చేపట్టేందుకు సన్నద్ధ్దమవుతున్నారు. ని యోజకవర్గం లో రాజకీయ స్తబ్దత నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులను ప్రకటించలేదు. తొలుత టీఆర్‌ఎస్ అభ్యర్థి మాత్రమే ఖరారు కావడంతో ఆయన ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారు.

ప్రతిపక్షం కరువు...
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని సుమారు 24 డి విజన్లలో టీఆర్‌ఎస్ కార్పొరేటర్లే ఉండటం ఆపార్టీకి పెద్ద బలం. డివిజన్లలో ప్రతిపక్షాలకు ప్రాతినిధ్యం లేకపోవడం, ద్వితీయ శ్రే ణి నాయకత్వం కూడా బలంగా లేకపోవడం టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చే అంశంగా మారింది. కార్పొరేటర్లంతా నిత్యం ప్రజల మ ధ్య ఉండటం, ఇప్పటికే పథకాలన్నీ ఇంటింటికీ చేరడం పార్టీకి అదనపు బలంగా మారుతోంది. ప్రతిపక్ష పార్టీల్లో ఇ ప్పటికీ అభ్యర్థులు ఖరారు కాకాపోవడంతో ఆ పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. మహాకూటమిలో ని ఏ పార్టీ ఖాతాలోకి తూర్పు నియోజకవర్గం పో తోందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో కూటమి పార్టీల కార్యకర్తలు ఆయోమయంలో ఉ న్నారు. టీఆర్‌ఎస్‌కు క్షేత్రస్థాయిలో బలమైన క్యా డర్ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ప్రచార ప్రణాళికలు సిద్ధం..
ఇప్పటి వరకు రాజకీయ స్తబ్దత నెలకొన్న తూర్పు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రచారం హోరెత్తించనుంది. అభ్యర్థి ఖరా రు కావడం.. నేడు నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో ఇక ప్రచార రంగంలోకి దూకేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. నియోజకవర్గ పరిధిలోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో శుక్రవారం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ సమాలోచనలు చేసి ప్రచార ప్రణాళికలకు రూపకల్పన చేశారు. డివిజన్లవారీగా ఇంటింటికీ పాదయాత్ర నిర్వహించేలా ప్రచార పర్వానికి కార్యాచరణ రూపొందించారు. తక్కువ సమ యం ఉన్నప్పటికీ డివిజన్లలో సుడిగాలి పర్యటనకు ప్రణాళికలు చేశారు. అన్ని డివిజనల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటి తలుపు తట్టేలా ప్రచారపర్వం ఉండేలా వ్యూహరచన చేశారు.

163
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...