మహాకూటమికి స్థానంలేదు


Sat,November 17, 2018 02:18 AM

రెడ్డికాలనీ, నవంబర్ 16: ప్రతిపక్షాల్లో ఐక్యత లేదని, మహాకూటమికి తెలంగాణలో స్థానం లేద ని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నా రు. శుక్రవారం 39వ డివిజన్ బ్రాహ్మణవాడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. మహాకూటమి పేరుతో దాడి చేయడానికి వ స్తున్నారని విమర్శించారు. అమరావతి నుంచి అ భ్యర్థిని తీసుకువచ్చి మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నా రు. టీఆర్‌ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. మహాకూటమి అభ్యర్థి నర్సంపేట తరహాలో అభివృద్ధి చేస్తామంటున్నారని, అంటే మున్సిపాలిటీని మురికికూపంగా మార్చుతారా అని ప్రశ్నించారు. మహాకూటమి అభ్యర్థి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, తెలంగాణ తల్లికి కానీ అ మరులకు నివాళులర్పించలేదని గుర్తుచేశారు. సీ ఎం కేసీఆర్ ప్రతి యేటా నగరాభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రూ.1490 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని, 59 వేల మంది సం క్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను తిరిగి గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్, బీజేపీ నుంచి చేరికలు
39వ డివిజన్ నుంచి కాంగ్రెస్, బీజేపీలకు చెం దిన పలువురు మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా వారికి వినయ్ భాస్కర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 39వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షుడు మోత్కూరి రవికిరణ్, కా ర్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్ రావుల సుదర్శన్, నాయకులు పులి రజినీకాంత్, ఉడుతల సారంగపాణి, చీకటి ఆ నంద్ తదితరులలు పాల్గొన్నారు.

30వ డివిజన్‌లో ప్రచారం
30వ డివిజన్ అలంకార్ జంక్షన్ మదీన మజీద్ వద్ద వినయ్‌భాస్కర్ గెలుపు కో సం కార్పొరేటర్ బోడ డిన్నా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ము స్లిం, మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని, అంతా కలిసి వినయ్ భాస్కర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యూత్ అ ధ్యక్షు డు జనగాని శంకర్, ఫజల్‌ఖాన్, ఫాసీ, రా జు తదితరులు పాల్గొన్నారు.

188
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...