ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలి


Sat,November 17, 2018 02:17 AM

వరంగల్, నమస్తేతెలంగాణ; నవంబర్ 16 : ఎన్నికలు సజావుగా జరిగేలా నిర్వహించే అధికారులు చర్యలు తీసుకోవాలని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ అన్నారు. ఎల్‌బీ కళాశాలలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ తరగతులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణ తరగతులను అధికారులు సద్వినియోగం చేసుకుని ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సందేహాలు ఉంటే శిక్షణ కాలంలోనే నివృత్తి చేసుకోవాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అదనపు కమిషనర్ నాగేశ్వర్, ఖిలా వరంగల్ తహసీల్దారు కిరణ్, బల్దియా సూపరింటెండెంట్ ప్రసన్నరాణి పాల్గొన్నారు.

స్ట్రాంగ్ రూముల పరిశీలన
ఎనుమాముల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ పరిశీలించారు. అక్కడ సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. భద్రతపరమైన అంశాలపై అధికారులతో చర్చించారు. ఇబ్బందులుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఆయన వెంట ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

109
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...