అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తా


Fri,November 16, 2018 01:41 AM

హసన్‌పర్తి, నవంబర్ 15 : ప్రజలు ఆశీర్వదించి అవకాశమిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని వర్ధన్నపేట టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సీతానాగారం, బైరాన్‌పల్లి, సిద్ధా పూర్, హరిశ్చంద్రనాయక్‌తండా, అర్వపల్లి, మల్లారెడ్డిపల్లిలో గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన, అభివృద్ధి చేసిన పనుల వివరాలను ఓటర్లకు వివరించారు. ఆయా గ్రామాల్లో రమేశ్‌కు అపూర్వ స్పందన కనిపించింది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని తిరిగి సీఎంగా కేసీఆర్‌నే గెలిపించుకుంటామని ఓటర్లు తేల్చిచెప్పారు. ఆయా గ్రామాల్లో మహిళలు బతుకమ్మలు, బోనాలతో, కోలాటాలు, ఎడ్లబండ్లతో స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారంలో అభ్యర్థి రమేశ్‌కు మంగళహారతులతో స్వాగతం పలికారు. పూల దండలతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రధాన కూడళ్లలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డగా నియోజకవర్గ ప్రజలు తల ఎత్తుకొని జీవించేలాగా అభివృద్ధి చేసానని, గడపగడపకూ సంక్షేమ పథకాలను అందజేసామని చెప్పారు. అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నానని ప్రజలు ఆశీర్వదించి అవకాశమిస్తే నియోజకవర్గ అభివృద్ధిని తెలంగాణలోనే నంబర్‌వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధికి పెద్దపీట వేసామన్నారు. మహాకూటమితో తెలంగాణకు అన్యాయమేనని, వారు అధికారంలోకి వస్తే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలలో కోతలు విధిస్తారని ఓటర్లకు వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కొత్తకొండ సుభాశ్‌గౌడ్, ఎంపీపీ కొండపాక సుకన్య, మార్కెట్ కమిటీ చైర్మన్ బండి రజనీకుమార్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అంచూరి విజయ్‌కుమార్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జక్కు రమేశ్‌గౌడ్, టీఆర్‌ఎస్వీ కేయూ ఇన్‌చార్జి జట్టి రాజేందర్, ఎన్నికల ఇన్‌చార్జి గట్టు రాజుతో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

180
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...