కూటమి మాయలో పడొద్దు


Fri,November 16, 2018 01:41 AM

ఎల్కతుర్తి: విలువలకు తిలోదకాలిచ్చి ఒక్కటవుతున్న మహాకూటమి మాయలో పడొద్దని, ఓట్ల కోసం వచ్చే ఆ కూటమి నా యకులను నమ్మి మోసపోవ్దని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని దామెర, చింతలపల్లి, వ ల్భాపూర్, దండేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో సతీశ్‌కుమార్ మాట్లాడారు. మహాకూటమి సీట్ల పంపకాల వద్దనే విచ్ఛిన్నమవుతుందని, సీట్ల కోసం వారు ఒకసారి ఢిల్లీకి, మరోసారి అమరావతి చుట్టూ పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వారు కేవలం సీట్లు, అధికారం కోసమే కొట్లాడుతున్నారే తప్ప ప్రజలకు మేలు చేసేందుకు ఏమాత్రం కాదని ఆరోపించారు. వారికి ఎజెండా ఏమీలేదని, సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే ధ్యేయమని ప్రగల్భాలు పలుకుతున్నారని, అసలు కేసీఆర్‌ను గద్దె దించాల్సిన అవసరం ఏంటో ప్రజలకు తెలుపాలని డిమాండ్ చేశారు. గడిచిన నాలుగేండ్ల కాలంలో సీ ఎం కేసీఆర్ దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. రైతుబీమా, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప థకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారని, మరోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే కనీవినీ ఎరగని రీతిలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని ఆ కాంక్షించారు. నాలుగేండ్ల కాలంలో వేలాది కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దే వాదుల నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.

గులాబీ పార్టీలో చేరికలు
మండలంలోని దామెర గ్రామానికి చెందిన కాంగ్రెస్, ఇతర పార్టీలు, యువజన సంఘాల నాయకులు, మాజీ వార్డు స భ్యు లు భారీగా హుస్నాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. సుమారు 200 మంది చేరగా, వారికి సతీశ్‌కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన సతీశ్‌కుమార్‌కు ఆ యా గ్రామాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్త లు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఒగ్గు, డప్పు, కోలాట బృందాలు తమ విన్యాసాలు, ప్రదర్శనలతో ప్రచారంలో పాల్గొన్నాయి. పలువురు సతీశ్‌కుమార్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ప్రచారం సాగుతున్నంత సేపు సతీశ్‌కుమార్ దారి పొడవున ఉన్న మహిళలు, వృద్ధుల వద్దకు వెళ్లి నమస్కరించగా, వారు ప్రతి నమస్కారం చేస్తూ కారు గుర్తుకే ఓటు వే స్తామని కరాఖండిగా చెప్పడం విశేషం. దామెర మాజీ సర్పంచ్ దివంగత మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లా డి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పెం చికల్‌పేట ఎంపీటీసీ ఏలిమి రాజమణి మనవడి శుభకార్యానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీ నియర్ నాయకులు పేర్యాల రవీందర్‌రావు, జన్నపురెడ్డి సురేందర్‌రెడ్డి, ఎంపీపీ తంగెడ శాలినీ, మండల అధ్యక్షుడు పోరెడ్డి ర వీందర్‌రెడ్డి, నాయకులు శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ మహేందర్, స్వామి, కిషన్‌రావు, మహేందర్, శేషగిరి, ప్రతాపరెడ్డి, లింగారావు, రవీందర్‌రెడ్డి, మహేందర్, నగేశ్, శ్రీనివాస్‌రెడ్డి, రాంరెడ్డి, రవి, రాజు, మదన్‌మోహన్‌రావు, వెంకటేష్‌యాదవ్, రాజేశ్వర్‌రావు, సంపత్‌రావు, బాపురావు, రాజేందర్, ఆనం దం, కొంరయ్య, దేవేందర్‌రావు, కొంరెల్లి, చంద్రమౌళి, వెంకన్న, ప్రవీణ్, రాజయ్య, శ్రీనివాస్, రాజమొగిలి పాల్గొన్నారు.

185
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...