మేయర్ నరేందర్‌కు అభినందనల వెల్లువ


Fri,November 16, 2018 01:41 AM

ఖిలావరంగల్: మహానగర పాలకసంస్థ మేయ ర్ నన్నపునేని నరేందర్ క్యాంపు కార్యాలయం గు రువారం సందడిగా మారింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్‌ఎస్ టికెట్‌ను మేయర్ నన్నపునేని నరేందర్‌కు కేటాయించిన విషయం తెలి సిందే. ఈమేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు, కార్పొరేట ర్లు, టీఆర్‌ఎస్వీ, టీఆర్‌ఎస్‌కేవీ, చాంబర్ ఆఫ్ కా మర్స్, డివిజన్లవారిగా సీనియర్ నాయకులు, నవ తెలంగాణ దివ్యాంగుల ఫోరంతోపాటు స్థానికు లు, ఆయన ఆత్మీయులు భారీగా క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పూలమాలలు, పుష్పగుచ్ఛా లు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ నరేందర్ మాట్లాడారు. తన పై నమ్మకంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేయర్‌గా అవకాశం క ల్పించి, అటు తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన కేసీఆర్‌కు ఆజన్మాంతం రుణబడి ఉంటా నన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానన్నారు. అలాగే తన అభ్యర్థిత్వానికి సహకరించి న టీఆర్‌ఎస్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తె లిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బిల్ల కవిత, శ్రీకాంత్, బైరబోయిన దామోదర్‌యాదవ్, సోమిశెట్టి శ్రీలత, ప్రవీణ్, శామంతుల ఉషశ్రీ, శ్రీనివా స్, కుందారపు రాజేందర్, మైదం నరేశ్, యెల్గం సత్యనారాయణ, లీలావతి, కత్తెరశాల వేణు, మేడి ద రజిత, మధుసూదన్, కేడల పద్మ, పీఏసీఎస్ చై ర్మన్ కేడల జనార్దన్, టీఆర్‌ఎస్వీ ప్రధాన కార్యదర్శి కలకొండ అభినాశ్, టీఆర్‌ఎస్‌కేవీ జిల్లా అధ్యక్షు లు బోగి సురేశ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, దివ్యాంగుల ఫోరం అధ్యక్షు డు బండి చక్రపాణి, అన్నపూర్ణ పరపతి సంఘం బాధ్యులు తోట మల్లయ్య, బండి కోటేశ్వర్‌రావు, ఎల్పుగొండ యాకయ్య, రమేశ్, కుమారస్వామి, సత్యం, వాసం రమేశ్ పాల్గొన్నారు.

244
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...