ఉత్కంఠకు తెర..


Thu,November 15, 2018 01:36 AM

- వరంగల్ తూర్పు బరిలో మేయర్ నరేందర్
--ప్రకటించిన టీఆర్‌ఎస్ అధిష్ఠానం
(వరంగల్ ప్రధానప్రతినిధి-నమస్తేతెలంగాణ): వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్ తూర్పు అభ్యర్థిగా నగర మేయర్ నన్నపునేని న రేందర్‌ను పార్టీ అధిష్ఠానం బుధవారంరాత్రి ప్రకటించిం ది. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన నరేందర్ వరంగల్ నగరంలో తెలంగాణ ఉద్యమానికి తనవం తు పాత్ర పోషించారు. పార్టీ రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా వివిధ బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు గెలుచుకున్నారు. పార్టీకి అత్యంత విధేయుడుగా ఆయన వివిధ సందర్భాల్లో తనకు తానుగా నిరూపించుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న స మయంలో టీడీపీకి రాజీనామా చేసి, టీఆర్‌ఎస్‌లో చేరా రు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ, టీఆర్‌ఎస్‌లో చే రినప్పటి నుంచి నగరంలోని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన అ నతి కాలంలోనే పార్టీలో కీలక పదవులు చేపట్టారు. 2014 లో నగర అధ్యక్షుడిగా నియమితులై పార్టీ విస్తృతికి విశేష ంగా కృషి చేశారు. అదే సమయంలో వచ్చిన సాధారణ ఎ న్నికల్లో ఇదే వరంగల్ తూర్పు టికెట్‌పై ఆశలు పెంచుకున్నారు.

పార్టీ, అధిష్ఠానం నిర్ణయం మేరకు అప్పుడు పోటీ చేయాలనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా సురేఖ గెలుపుకోసం ముందుండి నడిపించారు. 2016 కార్పొరేషన్ ఎన్నికల్లో 19వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై నగర మేయర్ పదవిని అధిష్టించారు. అనతి కాలంలోనే వరంగల్ మహానగర రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించారు. వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్‌భాస్కర్, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సహకారం, ఉప ముఖ్యమంత్రి క డియం శ్రీహరి తోడ్పాటుతో జాతీయస్థాయిలో వరంగల్ కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చి మేయర్‌గా నరేందర్ అం దరి సమన్వయతో ముందుకు సాగారు. ఈక్రమంలోనే వ రంగల్‌కు జాతీయస్థాయిలో అనేక అవార్డులు కూడా ద క్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఇక్కడ అభ్యర్థి ప్రకటించకపోయినా.. పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తానని, తన శక్తివంచన లేకుండా కృషిచేశారు. అభ్యర్థి ఎ వరైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే అన్న ధీమాతో పార్టీ నిర్ణయాన్ని ఆచరించారు. పార్టీపై విధేయత, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత ఇనుమడింపజేసేలా అందరి సహకారంతో ముదుకుసాగుతానని ఆయన ప్రకటించారు. విధేయత, ఆచరణ వల్లే వరంగల్ తూర్పు టికె ట్ వరించిందని పార్టీలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఐక్యతే బలం..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 11 నియోజకవర్గాలకు, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్వరాజు రాజయ్య, రాజ్యసభ మాజీ సభ్యురాలు, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురా లు గుండు సుధారాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, మేయ ర్ నరేందర్ టికెట్ ఆశించారు. ఈ ఐదుగురి పేర్లను పార్టీ పరిశీలించింది. అయితే తమలో ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేసి ఈ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని అంతా ఐక్యతా రాగాన్ని వినిపించారు. నాయకుల ఐక్యతారాగం, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోయినా పార్టీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యాచరణ పూర్తి చేశారు. అన్ని డివిజన్లలో బూత్ కమిటీలు వేసి పార్టీ ప్రతిష్టను పెంచారు. అంతకు ముందు అధినేత నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించిన నాయకులు..మేయర్ నరేందర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే అదే స్ఫూర్తిని కొనసాగిస్తునారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్.. వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామని ప్రకటించా రు. మరోవైపు నరేందర్ అధికారికంగా తన అభ్యర్థిత్వం ఖరారుకాగానే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.

గేట్ కింద జోష్..
టీఆర్‌ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థిగా నన్నపునేని న రేందర్‌ను ప్రకటించగానే అండర్ రైల్వేగేట్ ప్రాంతంలో టీ ఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. 1977లో ఆరెళ్లి బుచ్చయ్య తర్వాత ఇప్పుడు మేయర్ నరేందర్ అ సెంబ్లీతో కాలు మోపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరోవైపు చాంబర్ ఆఫ్ కామర్స్, వరంగల్ బులియన్ మర్చంట్, వివిధ వర్తక, వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు మేయర్ నరేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
క్యాంపు కార్యాలయం ఎదుట సంబురాలు
ఖిలావరంగల్: శివనగర్‌లోని మహానగర పాలకసంస్థ మేయర్ క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారంరాత్రి టీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్ టికెట్‌ను మేయర్ నరేందర్‌కు కేటాయించడంతో పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు, కా ర్పొరేటర్లు, స్థానికులు భారీగా తరలివచ్చారు. పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్నారు.

కేసీఆర్‌కు పాదాభివందనం: నరేందర్
వరంగల్ తూర్పు టికెట్ తనకు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాదాభివందనం చేస్తున్నానని మే యర్ నరేందర్ ప్రకటించారు. టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తగా అందరి మనస్సులను గెలిచేవిధంగా, వరంగల్ తూర్పు ప్ర జల అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే సైనికుడిగా తన ను ఆశీర్వదించాలని, ఆ భగవంతుడిని కోరుతున్నట్లు ఆ యన పేర్కొన్నారు. తనకు టికెట్ రావడానికి సహకరించి న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్టీ సీనియర్ నా యకుడు, తన రోల్ మోడల్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, సీనియర్ నాయకు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గుండు సుధారాణి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మెట్టు శ్రీనివాస్‌కు కృతజ్ఞ తలు తెలిపారు. పార్టీలోని అన్ని స్థాయిల నాయకుల సహకారం, వారి సలహాలు సూచనలతో తూర్పు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని అన్నారు. ప్రజల ఆశీర్వాదం తనకు దక్కేలా ప్రతి ఒక్కరినీ పేరుపేరున దేవుళ్లుగా భావిస్తానని ఆయన ప్రకటించారు.

312
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...