టీఆర్‌ఎస్‌కు ఎదురులేదు


Thu,November 15, 2018 01:35 AM

హన్మకొండ, నమస్తేతెలంగాణ: ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యంలేక మహాకూటమిగా నాలుగు పార్టీలు జట్టు కట్టాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండి ప డ్డారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి దా స్యం వినయ్‌భాస్కర్ నామినేషన్ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణితో కలిసి వచ్చి హన్మకొండ ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి బుధవారం నామినేషన్ పత్రాల ను దాఖలు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు మహాకూటమి పోటీయే కాదని ఎద్దే వా చేశారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ బాహుబలి అని, ఆయనను మించిన బాహుబలి లేడన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు రాష్ర్టాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపాయని అన్నారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో రూ.42 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు.

తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర బడ్డెట్‌లో రూ.46 వే ల కోట్లతో సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని నమూనా మ్యా నిఫెస్టోలో ప్రకటించినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయా న్ని దండుగ అన్న పార్టీలకు సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పం డుగ చేసి, రైతును రాజును చేసి చూపాడని అన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా, రైతులకు పంట రుణాల మాఫీ, రైతుబంధు అమలు చేసి రూ. 8 వేల నుంచి రూ.10 వే లకు పెంపు, రైతులకు రూ. 5లక్షల బీమా, కేసీఆర్ కిట్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, మహిళ రక్షణ కోసం ప్రత్యేక పథకాలు అ మలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టుల ని ర్మాణం అడ్డుకోవాలని ప్రయత్నించారని, వారి అడ్డంకులను అధిగమిస్తూ కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కేంద్ర జలసంఘం కితాబు ఇచ్చిందని తెలిపారు. ఆగస్టు నాటికి కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి, ఎస్‌ఆర్‌ఎస్పీకి అనుసంధానం చేసి 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. వరంగల్ పశ్చిమ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దా స్యం వినయ్‌భాస్కర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

తెలంగాణలో పచ్చ జెండా కనిపించొద్దు..
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వరంగల్ నుంచి చావు దెబ్బ ప్రారంభం కావాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అధికారమే పరమావధిగా భావించిన కాంగ్రెస్ మహా కూటమిని ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో టీ డీపీని చిత్తుగా ఓడించాలని, సైకిల్ గుర్తు, పచ్చజెండా ఇక్కడ క నిపించొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే రెండుసార్లు ప్రచారం పూర్తి చేసినట్లు తెలిపారు. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల నాటికి మరో మూడుసార్లు నియోజకవర్గాన్ని చుట్టి వస్తానని ప్రకటించారు. నియోజకవర్గం లో 50 వేల మంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఉన్నారని, తన గెలుపు ఖాయమని, భారీ మెజార్టీ సాధించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.

254
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...