పశ్చిమలో ఐదు నామినేషన్లు ..


Thu,November 15, 2018 01:35 AM

హన్మకొండ, నమస్తేతెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మూడో రోజు ఐదు నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్ తన నామినేషన్ పత్రాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి వెంట రాగా రిటర్నింగ్ అధికారి వెంకారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నాయిని రాజేందర్‌రెడ్డి తన కూతురు శ్రీగోదా, నాయకులు ఈవీ శ్రీనివాసరావు వెంట రాగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా మార్తినేని ధర్మారావు, రావుపద్మ అమరేందర్‌రెడ్డిలు నామనేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా డాక్టర్ తిరునహరి శేషు నామినేషన్ చేశారు. నియోజకవర్గం పొత్తుల్లో భాగంగా మహాకూటమి అభ్యర్థి టీడీపీకి చెందిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేటాయించగా అక్కడ సీటును ఆశించిన డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా ధర్మారావును రెండో జాబితాలో ప్రకటించగా, ఈ సీ టును ఆశిస్తున్న మరో అభ్యర్థి, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అమరేందర్‌రెడ్డి నామినేషన్ దా ఖలు చేశారు.

244
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...