ఎన్నికల ప్రక్రియపై అవగాహన ఉండాలి


Thu,November 15, 2018 01:34 AM

-తూర్పు రిటర్నింగ్ అధికారి గౌతమ్
వరంగల్, నమస్తేతెలంగాణ : ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ అన్నారు. బుధవా రం కార్పొరేషన్ కౌన్సిల్‌హల్‌లో ఎన్నికల ప్రిసైడిం గ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల కు, మాస్టర్ శిక్షకులకు ఆయన ఎన్నికల ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల పోలింగ్‌కు ఒకరోజు ముందే డిసెంబర్ 6వ తేదీ రాత్రి 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఈవీఎం, వీవీప్యాట్‌లతో పాటు ఎన్నికల సామగ్రిని భద్రంగా ఉంచాలని వాటిని వదిలి ఎక్కడికి వెళ్లకూడదని సూచించారు. పోలింగ్ రోజు ఉదయం 5.30 గంటల వరకు పో లింగ్ ఏర్పాటు పూర్తిచేసుకోవాలన్నారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహంచాలని అ న్నారు. 6.15 గంటల వరకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకాకపోతే రిటర్నింగ్ అధికారితో పాటు సె క్టోరియల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు.

జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, ప్రత్యేక బృందాలు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తారని అన్నారు. పోలింగ్ కేంద్రంలో ఒకరోజు ముందు బస చే యాల్సి ఉన్న పరిస్థితులలో సిబ్బంది దుప్పట్లు, దుస్తులు, మందులు, అవసరమైన వస్తువులు వెం ట తీసుకపోవాలన్నారు. ఎన్నికల విధులకు గైర్హజర్ అయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్‌ల నిర్వాహణపై రిటర్నింగ్ అధికారి గౌతమ్ ఎన్నికల అధికారులకు అవగాహన కల్పించారు. ప్రతి 15 మంది అభ్యర్థులకు ఒక బ్యాలెట్ యూనిట్ అవసరం ఉంటుంద న్నా రు. అదనపు బ్యాలెట్ ఎలా అమర్చాలి అనే దాని పై ఆయన అవగాహన కల్పించారు. పోలింగ్, పో లింగ్ తర్వాత చర్యలపై ఆయన అధికారులకు వి వరించారు. పోలింగ్ యంత్రాలు, నిర్వహణ, పో లింగ్ ప్రక్రియకు సంబంధించిన దానిపై రూపోందించిన వీడియోను ప్రదర్శించారు. ఎన్నికల అధికారులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ఏలాంటి చిన్న సమస్య ఎ దురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించా రు. కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి నాగేశ్వర్, తహసీల్దార్ కిరణ్, మాస్టర్ ట్రైనర్లు, రాఘవేందర్, సదానందం, రత్నాకర్, నగేశ్, విష్ణుమూర్తి, శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, సామల సతీశ్, ఏ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

190
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...