విద్యార్థులు పరిశోధనలు చేయాలి


Wed,November 14, 2018 02:12 AM

-జాయింట్ కలెక్టర్ దయానంద్
-కరీమాబాద్‌లో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
కరీమాబాద్, నవంబర్ 13 : విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగి పరిశోధనలు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ సూచించారు. తెలంగాణ ప్రభుత్వం జిల్లా వి ద్యాశాఖ ఆధ్వర్యంలో బీరన్నకుంటలోని కరీమాబాద్ ప్రభు త్వ పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించా రు. ఈ సందర్భంగా జేసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లా డారు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. విద్యార్థులు చ దవుతో పాటు అన్నిరంగాల్లో నూ రాణించాలన్నారు. సమాజానికి పనికివచ్చే విధంగా కొత్త ఆలోచనలతో విద్యార్థు లు ప్రయోగాలు చేపట్టాలన్నారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ జీవితంలో ఎ దుర్కొంటున్న సవాళ్లకు-శాస్త్రీ య పరిష్కారాలు అనే అంశంపై జి ల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పా టు చేశామన్నారు. రెండు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ ఉం టుదన్నారు. అనంతరం జేసీ, ఆర్జేడీ, డీఈవో కలిసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ రాజీవ్, సైన్స్ అధికారి కేశవరావు, ఎంఈవో వీరభద్రునాయక్, కరీమాబాద్ పాఠశాల హెచ్‌ఎం ఉపాకర్‌రెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం డీ శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

419 ఎగ్జిబిట్లు..
అగ్రికల్చర్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, హెల్త్ అండ్ క్లీన్‌నె స్, రీసోర్స్ మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్టు అండ్ కమ్యూనికేషన్ తదితర అంశాలపై విద్యార్థులు ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. జిల్లావ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన పాఠశాలల విద్యార్థులు దాదాపు 419 ఎగ్జిబిట్లను ప్రదర్శించా రు. పలు ఎగ్జిబిట్లు చూపరులను ఆలోచింపజేశాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఆకట్టుకున్నాయి. వరంగల్, ఖిలా వరంగల్, ఐనవోలు, కమలాపూర్, భీమదేవరపల్లి మండలాలకు చెందిన పలు పాఠశాలల విద్యార్థులు ఎగ్జిబిట్లను సందర్శించారు. సైన్స్‌ఫేర్ నిర్వాహణకు 12కమిటీలు వేసినట్లు అధికారులు తెలిపారు.
నేడు ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వ హిస్తున్న సైన్స్ ఎగ్జిబిషన్‌లో డీఈవో వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు నిరసన తెలిపాయి. ప్రభుత్వ నిధులతో చేపట్టిన కార్యక్రమంలో వేదిక పైకి ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాన్ని పిలవడంపై సంఘాలు అసహనం వ్యక్తం చేశాయి.

175
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...