మరింత నిఘా పెంచాలి


Wed,November 14, 2018 02:10 AM

-పార్టీల ప్రచారంపై ప్రత్యేక దృష్టి
-తూర్పు రిటర్నింగ్ అధికారి గౌతమ్
వరంగల్, నమస్తేతెలంగాణ: నామినేషన్ ప్రక్రి య మొదలైన తరుణంలో రాజకీయ పార్టీలు ప్ర చారం ఉధృతం చేసే క్రమంలో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నిఘా పెంచాలని తూర్పు రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ అన్నారు. మంగళవారంరాత్రి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఫ్లయింగ్ స్కాడ్, స్టాటికల్ సర్వేలెన్స్ బృందాల అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బృం దాల వారిగా అప్పగించిన బాధ్యతలను అధికారులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇప్పటి వరకు అన్ని బృందాలు ఒకే పని చేస్తున్నారని, ఇ ప్పటి నుంచి ఎవరి పని వారు చేయాలని అన్నా రు. తూర్పు నియోజకవర్గం పరిధిలో మూడు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు ఏర్పాటు చేసి వారికి రూట్ కేటాయించామని అన్నారు. అలాగే మూడు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఫ్ల యింగ్ స్కాడ్‌లు తమకు కేటాయించి న రూ ట్‌లో నిరంతరంగా గట్టి నిఘా పెట్టాలన్నారు. ప్ర ధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులలో తనిఖీలు చేయాలని అన్నారు. అయా ప్రాం తాల్లో ఉన్న రాజకీయ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, మహిళా సంఘాల లీడర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు గుర్తిస్తే, వెం టనే సమాచారం అందించాలని అన్నారు.

ప్రచారంలో అభ్యర్థుల పోస్టర్లు, బ్యానర్లు, వాల్‌రైటింగ్‌పై ఫ్ల యింగ్ స్కాడ్ బృందాలు దృష్టి పెట్టాలన్నారు. కార్పొరేటర్లు కార్యాలయాలు తెరవడానికి రిటర్నింగ్ అధికారి పర్మిషన్ తీసుకోవాలన్నారు. వీటన్నిటిపై ఎంసీసీ బృందాలు నిఘా పెట్టాలన్నా రు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే నోటీసులి చ్చి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టాలని, ఉ ల్లంఘనకు పాల్పడితే కేసులు నమోదు చేయాలని ఫ్లయింగ్ స్కాడ్‌లకు ఆయన సూచించారు. బూ తు స్థాయిలో చైతన్య సంఘాలను ఏర్పాటు చేసి వారితో ఎ ప్పటికప్పుడు వివరాలు సేకంచాలన్నా రు. సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటి వరకు నిఘా బృందాలచే ఎన్నికల ప్ర వర్తన నియమావళి ఉల్లంఘన కింద ఆరు ఎఫ్‌ఐఆర్‌లు, నా లుగు సుమోటో కేసులు, లక్షా 75వేల లెక్క చూ పని నగదు స్వాధీనం చేసుకుని, ఒక వాహనం సీ జ్ చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎన్నికల ప్రత్యేక అధికారి ఉదయ్, సహాయక ఖర్చు పరిశీలకులు ఖాజామస్తాన్, ఫ్లయింగ్ స్కాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అధికారులు పాల్గొన్నారు.

204
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...