నమ్మితే మోసపోతాం


Wed,November 14, 2018 02:10 AM

-మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్
-జోరందుకున్న ఎన్నికల ప్రచారం
-గ్రామాల్లో ఘన స్వాగతం
వర్ధన్నపేట, నమస్తేతెలంగాణ: తెలంగాణ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించి, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల నిర్మాణాలకు మోకాలడ్డుతున్న మహాకూటమి నాయకులను నమ్మితే మరోసారి మోసపోతామని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని చెన్నారం, కాశగూడెం, నల్లబెల్లి, ఉప్పరపల్లి, కట్య్రాల, కడారిగూడెం, రామోజీకుమ్మరిగూడెం తండాల్లో మంగళవారం అరూరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల ప్రధాన కూడళ్ల వద్ద జరిగిన సభల్లో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు, సీమాంధ్ర నేతలు ఎలా అడ్డుతగిలారో ప్రజలు తెలుసన్నారు. అలాంటి పార్టీలు కూటమిగా ఏర్పడి తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను ప్ర వేశపెట్టి పారదర్శకంగా అమలు చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధిలో కూడా రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిలో నిలిపిందన్నారు.

ప్రతీ గ్రామంలో సమస్యలను గుర్తించి వాటిని దశల వారీగా పరిష్కరిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికాగానే ప్రతీ గ్రామంలోని చెరువుకు నీటిని అందిస్తామన్నారు. కాగా, అరూరి రమేశ్ ఇంటింటి ప్రచారం మరింత ఊపందుకుంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రణాళిక ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మండలంలోని చెన్నారం, కాశగూడెం, నల్లబెల్లి, ఉప్పరపల్లి గ్రామాల్లో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ప్రచారం చేపట్టారు. అలాగే సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వ రకు కట్య్రాల, కడారిగూడెం, రామోజీకుమ్మరిగూడెం తండాల్లో ప్రచారం చేశారు. గ్రామాలకు అరూరి రమేశ్ చేరుకోగానే ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి బోనాలు, బతుకమ్మలతో ఘ నంగా స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మార్నేని ర వీందర్‌రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, ఏఎంసీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, మార్గం భిక్షపతి, రాజమణి, లక్ష్మి, దేవేంద్ర, బొచ్చు జ్యోతి, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...