ఎన్నికల బందోబస్తులో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి


Wed,November 14, 2018 02:09 AM

-వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మహేందర్‌రెడ్డి
-పోలీసు అధికారులకు పలు సూచనలు
నయీంనగర్, నవంబర్ 11 : ఎన్నికల నిర్వహణ బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పలు సూచనలు చేశారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకోనున్నచర్యలను ఆయన సీపీ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సమాధామిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రం నుంచి వచ్చిన సాయుధ బలగాలతో డివిజన్‌లలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించి ప్రజల్లో ధైర్యం పెంపొందించినట్లు వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు అధికారులను, బలగాలను నియమించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నియంత్రణకు తనిఖీలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీలు వెంకట్‌రెడ్డి, డాక్టర్ అనురాధ, శ్రీనివాస్‌రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.

168
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...