ఉద్యమకారులకు బెయిల్


Wed,November 14, 2018 02:09 AM

-సెంట్రల్ జైలు ఎదుట టీఆర్‌ఎన్ నాయకుల కోలాహలం
-స్వాగతం పలికిన మర్రి యాదవరెడ్డి, డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్
నయీంనగర్, నవంబర్ 11 : తెలంగాణ ఉద్యమ సమయం లో కానిస్టేబుల్‌ను గాయపరిచారని కేసు నమోదు చేసి జైలుకు పంపిన ఇద్దరు ఉద్యమకారులకు రెండు రోజల జైలు జీవితం అనంతరం మంగళవారం సాయంత్రం బెయిల్ లభించింది. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జైలు ఎదుట టీఆర్‌ఎస్ నాయకులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ ఉద్యమకారులకు స్వాగ తం పలికారు. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణ ఉద్యమ సమయంలో 610 జీవో కోసం కాజీపేట తారా గార్డెన్‌లో ఉద్యోగ సంఘాలతో సమావేశమైన క్రమంలో మఫ్టీలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనపై అప్పట్లో కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో నార్లగిరి రమేశ్, గబ్బెట శ్రీనువాస్, మిడిదొడ్డి శ్రీధర్, మరో వ్యక్తిపై కేసు నమోదైంది. పెండింగ్ కేసులను విచారిస్తున్న క్రమంలో గత కేసు తెరపైకి రావడంతో కాజీపేట ఏసీపీ నర్సింగరావు, సీఐ అజయ్ నార్లగిరి రమేశ్, గబ్బెట శ్రీనువాస్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి సోమవారం కోర్టులో హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి వారిద్దరినీ రిమాండ్‌కు పంపించారు. మంగళవారం బెయిల్‌రావడంతో కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ సెంట్రల్ జైలుకు వచ్చి స్వాగతం వారికి పలికారు. పూలదండలు వేసి అప్పటి స్మృతులను గుర్తుచేసుకొని జై తెలంగాణ నినాదాలు చేశారు.

209
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...