కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్


Wed,November 14, 2018 02:08 AM

-రాజ్యసభ సభ్యుడు,
కిట్స్ కాలేజీ సెక్రటరీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు
భీమారం, నవంబర్ 13 : వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల (అటానమస్)కి నాక్‌ఏ గ్రేడ్‌ను నేషనల్ అసెస్‌మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) కమిటీ మంగళవారం ప్రకటించినట్లు రాజ్యసభ సభ్యుడు, కిట్స్ కళాశాల సెక్రటరీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు తెలిపారు. వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కళా శాలను ఈ నెల 2 తేదీన పర్యవేక్షించి ఏడు అంశాలను పరిగణలోకి తీసుకుని నాక్ -ఏ గ్రేడ్ అవార్డును ప్రకటించినట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా నాక్ కమిటీ కళాశాలలోని మౌలిక వసతుల కల్పన, బోధన అంశాలను పరిగణలోకి తీసుకుందని వివరించారు. దీనిలో కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీకి 4.0 సీజీపీఏ. స్కోర్‌కు వరంగల్ కిట్స్ కాలేజీకి 3.21 స్కోర్ ను సాధించడం విశేషం అని లక్ష్మీకాంతారావు అన్నారు. వరంగల్ కిట్స్ కాలేజీలో నాక్ కమిటీ ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ గ్రేడ్‌ను కిట్స్ కాలేజీకి ప్రకటించినట్లు కెప్టెన్ వివరించారు. కరిక్యూలమ్ యాస్పెక్ట్, టీచింగ్-లెర్నింగ్ విధానాలు, పరిశోధనలు -ఇన్నోవేషన్ -ఎక్స్‌టెన్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ - లెర్నింగ్ రిసోర్సెస్, స్టూడెంట్ సపోర్ట్ -ప్రొగ్రెషన్, గవర్నెన్స్ - లీడర్‌షిప్ మేనేజ్‌మెంట్, ఇన్‌స్టిట్యూషనల్ వాల్యూ స్- బెస్ట్ ప్రాక్టీసెస్ అనే ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకోని కళాశాలకు నాక్‌ఏ గ్రేడ్‌ను ప్రకటించినట్లు వెల్లడిం చారు. వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించిన నుంచి మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తూ నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామని లక్ష్మీకాంతారావు గుర్తు చేశారు. ఇక్కడ చదివిన విద్యార్థులు అంతర్జాతీయంగా రాణిస్తు కిట్స్‌కు పేరుప్రఖ్యాతులు తీసుకోని రావడం గర్వకరణంగా ఉందన్నారు. కిట్స్ కాలేజీకి నాక్ ఏ గ్రేడ్ అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు, ఆఫీసు సిబ్బంది, పూర్వ విద్యార్థులు కష్టపడి ప్రణాళిక బద్ధంగా కళాశాలను షెడ్యూల్ ప్రకారం నడిపిస్తున్నందుకు అభినందనలు తెలిపారు.

154
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...