తెగని లొల్లి


Tue,November 13, 2018 02:03 AM

-రెండో రోజుకుచేరిన కాంగ్రెస్ నేతల ఆమరణ దీక్ష
-బెడిసి కొట్టిన వీహెచ్ సయోధ్య
-బీ-ఫామ్‌తో వస్తేనే బయటికి వస్తామని హెచ్చరిక
-తూర్పున బాంబు పేల్చిన రాజనాల
-ఎవరి భక్తుడీ హనుమన్న ..?
-పశ్చిమ నుంచే పోటీ అంటూ సమాయత్తం అవుతున్న టీడీపీ నేత రేవూరి
-ఈనెల 19న నామినేషన్ దాఖలు
కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ మొదలైనా అభ్యర్థిత్వాలు ఖరారు కాకపోవడం, మహాకూటమి పొత్తులో వరంగల్ పశ్చిమ స్థానాన్ని టీడీపీకీ కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. ఆ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికే పశ్చిమ టికెట్ ఇవ్వాలని గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ నేతృత్వంలో నాయకులు రెండు రోజులుగా ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. హన్మకొండలోని డీసీసీ కార్యాలయానికి తాళం వేసి స్వీయ నిర్బంధం చేసుకున్నారు. ఈ ఉదంతం కాంగ్రెస్‌లో కలకలం సృష్టించడంతో సోమవారం కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు రాగా ఆయనపై పార్టీ నేతలు తిరగబడ్డారు. నాయినికి టికెట్ ఇస్తున్నామని బీ-ఫామ్‌తో వస్తేనే తాము లోపలి నుంచి బయటికి వస్తామని, అప్పటివరకూ ఆమరణ దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఒక దశలో పార్టీ నగర మైనార్టీ నాయకులు రజాలి వీహెచ్‌తో వాగ్వాదానికి దిగగా, చేసేదేమి లేక సమస్యను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఆయన వెనుదిరిగిపోయారు. మరోవైపు వరంగల్ తూర్పు స్థానం నుంచి కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి నామినేషన్ దాఖలు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్లను అమ్ముకున్నారని, ఆయన బండారం త్వరలోనే బయటపెడతానని చెప్పడం కాంగ్రెస్‌లో అగ్గి రాజేసింది. -వరంగల్ ప్రధాన ప్రతినిధి/నమస్తేతెలంగాణ

మహాకూటమి కుంపట్లు చల్లారడం లేదు. భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు జనం దగ్గరికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కాదు, ప్రచారం మాట దేవుడెరుగు తిరుగుబాటు దారుల్ని బుజ్జగించడం పూర్తి కాకుండానే ఎన్నికల ప్రక్రియ ముగిసేటట్లు కనిపిస్తోంది. వరంగల్ పశ్చిమ సీటును పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికే ఇవ్వాలని రెండు రోజులుగా గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ నేతృత్వంలో నాయకులు పార్టీ కార్యాలయాల్లో స్వీయ నిర్బంధం చేసుకొని ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్షకు దిగిన నేతలను బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు సోమవారం వచ్చారు. మూడున్నర దశాబ్దాలుగా పార్టీ కోసమే పనిచేస్తున్న అధ్యక్షుడిని కాదని, పొత్తుల్లో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించడం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అభ్యర్థిగా దాదాపు ఖరారైన సంకేతాల నేపథ్యంలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి సహకరించేది లేదని తెగేసి చెబుతూ పార్టీకి కాంగ్రెస్ నాయకులు అల్టిమేటం జారీ చేశారు. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పార్టీ సీనియర్ నేత వీ హన్మంతరావు.. దీక్షకు దిగిన వారితో చర్చించి, బుజ్జగించి దీక్ష విరమించాలన్న ప్రయత్నం బెడిసి కొట్టింది. పార్టీ కార్యకర్తలు, నాయకులు వీహెచ్‌పై తిరగబడ్డారు. నాయిని రాజేందర్‌రెడ్డికి టికెట్ ఇస్తున్నామని, బీ ఫామ్‌తో వచ్చేదాకా తాము లోపలి నుంచి బయటికిరాబోమని, ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఒక దశలో పార్టీ నగర మైనార్టీ నాయకులు రజాలీ వీహెచ్‌పై వాగ్వాదానికి ది గారు. మహిళా నాయకులు పార్టీని నమ్ముకొని ఉన్నవారిని కాకుండా టీడీపీకి ఎట్లా సీటు కేటాయిస్తారని నిలదీశారు. గంటన్నర పాటు కాంగ్రెస్ భవన్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నారు. లోపల ఉన్నవారు దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. వీహెచ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానానికి విషయాన్ని చేరవేస్తామని, రేవూరి ప్రకాశ్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చయినా సరే రాజేందర్‌రెడ్డికి టికెట్ వచ్చేలా కృషి చేస్తానని పేర్కొని అక్కడి నుంచి వెనుదిగారు.

రసవత్తరంగా రాజకీయం..
వరంగల్‌లో రసవత్తర రాజకీయం సాగుతోంది. పాలకుర్తిలో జంగా రాఘవరెడ్డిపై పీసీసీ కార్యదర్శి బిల్లా సుధీర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంధిపోటు దొంగ జం గా అంటూ అతని నేరచరిత్రను బయట పెట్టారు. డీసీసీబీని దోపిడీ చేసిన దొంగ జంగా అంటూ జంగా రాఘవరెడ్డికి సంబంధించిన 12పేజీల నేర చరిత్రపై రాయపర్తిలో బ్రోచర్‌ను విడుదల చేశారు. కాంగ్రెస్ బతకాలంటే పాలకుర్తి నియోజకవర్గం నుంచి జంగారాఘవరెడ్డికి టికెట్ ఇవ్వొద్దన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రి జీ విజయరామారావు, ఇందిరా, మా దాసి వెంకటేశ్ తదితర నాయకులు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇందిరకు టికెట్ కేటాయించినట్లు ప్రచారం సాగుతుండగా, మిగతా వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని ఆశావహులు తెగేసి చెబుతున్నారు. వరంగల్ తూ ర్పులో కొట్లాట ఎటూ తేలలేదు. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి ఒకరికి టికెట్ వస్తే నలుగురు వ్యతిరేకించే స్థితికి ఆ పార్టీ వెళ్లిపోయింది. దీంతో ఏం చేయాలో తోచక పార్టీ అధిష్టానం అంతర్మథనంలో పడింది. ఏమీ పట్టించుకోకుండా నాన్చివేస్తున్న అధిష్టానం అసలు పోటీ చేసే ఉద్దేశంతో ఉందా? లేదా అనే అనుమానాలు పార్టీ కేడర్‌లో వ్యక్తమవుతున్నాయి.

ఎవరొచ్చినా చెప్పుదెబ్బలే
తమను బుజ్జగించేందుకు ఎవరొచ్చినా చెప్పుదెబ్బలు తప్పవని కాంగ్రెస్ రెబల్ అ భ్యర్థి, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రె సిడెంట్ రాజనాల శ్రీహరి తీవ్రంగా హె చ్చరించారు. వరంగల్ తూర్పు నియోజకర్గం నుంచి రెబల్‌గా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఈ బాం బు పేల్చారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తనకొడుకు కౌశిక్‌రెడ్డితో టికెట్ల కోసం డబ్బులు వ సూలు చేశారని ఆరోపించారు. తాను కేవ లం ఆరోపణలకే పరిమితం కానని, రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహా బయటపెడతానని ప్రకటించారు. 25 ఏళ్లుగా పా ర్టీనే నమ్ముకొని పనిచేస్తే తమను కాదని ఎవరికో టికెట్ ఇస్తున్నట్టు లీకులిస్తే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. పార్టీని నమ్ముకొ ని ఉన్నవాళ్లంతా పోటీచేయడానికి సిద్ధం ఉన్నారని పేర్కొన్నారు.

ఎవరి భక్తుడీ హన్మన్న
ఉన్నఫళంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ వీ హన్మంతరావు సోమవారం నగరంలో కాంగ్రెస్ భవన్‌లో ప్రత్యక్షం కావడం వెనుక మహాకూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, టీడీపీ శ్రేణల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నది. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాల్లో కనిపించకుండాపోయిన వీహెచ్.. అధిష్టానం పంపితే వచ్చారా? లేదా పార్టీవీరభక్త హనుమానుడిగా సుమోటోగా వచ్చారా? అన్న అనుమానాలను కూటమి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ సీనియర్ నాయకుడిగా పార్టీకి నష్టం జరగకూడదనే తాను వచ్చానని వీహెచ్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ దృష్టికి విషయ తీసుకెళ్తానన్నారు. ఆయన ఎంత చెప్పినా అక్కడి నాయకులు ససేమీరా అన్నారు. అసలాయనకే అక్కడ పతారె లేదు అని ఆరోపించారు. వీహెచ్‌కు నాయిని రాజేందర్‌రెడ్డి దగ్గర, ఈ కోణంలో ఆలోచిస్తే బహుశా ఆయనే తనకు ఇమేజ్ పెరిగేందుకు ఇక్కడికి రప్పించుకోవచ్చు కదా! అనే అనుమానాలను టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆమరణ దీక్షల వెనుక ఆంతర్యాన్ని అనుమానిస్తున్నాయి. అటు వీహెచ్‌పైన అనుమానపు ప్రచారాన్ని టీడీపీ వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తున్నది.

19న రేవూరి నామినేషన్
వరంగల్ పశ్చిమ టికెట్ తనకే వచ్చిందని రేవూరి ప్రకాశ్‌రెడ్డి తన అనుచరులతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కలిసి వస్తే కలదు సుఖం.. లేదంటే కలహాలు పదిలం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. 19న మహాకూటమి వరంగల్ పశ్చిమ అభ్యర్థిగా తాను నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సన్నిహితులతో పేర్కొన్నారు. ఇదే రోజు కాంగ్రెస్ నుంచి నాయిని రాజేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు సన్నిహితులతో చె ప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకర్గం ఏమైనా ధర్మసత్రమా అని ప్రకటించిన నాయిని.. ఎవరొచ్చినా సరే తాను పోటీచేస్తానని కరాఖండిగా తేల్చి చెప్పిన విషయం అందరికకీ తెలిసిందే.

279
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...