నాయినికి టికెట్ దక్కేలా చూస్తా..


Tue,November 13, 2018 02:02 AM

న్యూశాయంపేట, నవంబర్12: వరంగల్ పశ్చిమ టికెట్‌ను ఉమ్మడి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఇచ్చేలా ప్రయత్నిస్తానని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హన్మంతారావు చెప్పారు. హన్మకొండ కాంగ్రెస్ భవన్‌లో నిరాహారదీక్ష చేస్తున్న నాయకులను ఆయన సోమవారం పరామర్శించారు. కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వియ నిరాహార దీక్ష చేపట్టిన వారితో వీహెచ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని నాలుగేళ్లుగా బతికిస్తున్న రాజేందర్‌రెడ్డికి న్యాయం జరుగుతుందని, కష్ట నష్టాలకు ఓర్చుకొని పార్టీకోసం పనిచేస్తున్న వారికి టికెట్ ఇవ్వడమే న్యాయమన్నారు. కూటమిలో భాగంగా టీడీపీకి టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, ఉత్తంకుమార్‌రెడ్డి, కుంతియాలతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. ఆమరణ దీక్షతో ఎవరూ ప్రాణం మీదికి తెచ్చుకోవద్దని హితవుపలికారు. ఈ సమయంలో నాయిని రాజేందర్‌రెడ్డికి టికెట్ ఎందుకివ్వలేదని కాంగ్రెస్ సిటీ ఉపాధ్యక్షుడు రజాలి నిలదీసే ప్రయత్నం చేయగా, కోప్రొద్రిక్తుడైన వీహెచ్ ఆయన్ను నెట్టేశారు. మహిళా నాయకులతో మాట్లాడుతున్నా కదా.. అంటూ ఆవేశానికి లోనయ్యారు. సిటీ ప్రెసిడెంట్ కట్ల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ తోట వెంకన్న, మహిళా జిల్లా అధ్యక్షురాలు బంక సరళాదేవి, నాయిని లకా్ష్మరెడ్డి, బంక సంపత్‌యాదవ్, గణేశ్, మండల సమ్మయ్య, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర కార్యదర్శి అలువాల కార్తీక్, జిల్లా కార్యదర్శి సత్తు రమేశ్, నగర కార్యదర్శి కృష్ణ, రమేశ్ తదితరులున్నారు.

298
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...