టీఆర్‌ఎస్‌తోనే ముదిరాజ్‌లకు గుర్తింపు


Tue,November 13, 2018 02:02 AM

ఐనవోలు నవంబర్ 12: టీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే ముదిరాజ్‌లకు గుర్తింపు వచ్చిందని రాజ్య సభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. సోమవారం ఐనవోలు మండల కేంద్రంలో సభాధ్యక్షుడు చొప్పరి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఐనవోలు, పర్వతగిరి, హన్మకొండ, కాజీపేట మండలల ముదిరాజ్, బెస్తల ఆశీర్వాద సభకు మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి బండ ప్రకాశ్ హాజరై మాట్లాడారు. నాలుగేళ్లలో ఇప్పటికే 250 కోట్ల ఉచిత చేప పిల్లను చెరువుల్లో కలిపినట్లుగా గుర్తు చేశారు. సభ్యత్వం ఉన్న ప్రతీ మత్స్యకారుడికి సబ్సిడీ పై ద్విక్రవాహనాలను అందిచడానికి సీఎం కేసీఆర్ ప్రణాళిక రుపొందించి 60 వేల ద్విచక్ర వాహనాలను కేటాయించినట్లుగా వివరించారు. అర్బన్ జిల్లాకు ఇప్పటికే 1800 ద్విచక్రవాహనాలను కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవుల తరువాత ఎక్కువ శాతం లబ్ధి పొందింది మత్సకారులేనని, ఈ విషయం మరిచిపోవద్దని పేర్కొన్నారు.

పార్టీలో పలువురి చేరికలు..
ఐనవోలు మండలం నందనం, వర్ధన్నపేట ఉప్పురపల్లి, పర్వతగిరి మండలం వడ్లకొండ, ఏనుగల్లు గ్రామాల నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలకు చెందిన 100 మంది ముదిరాజ్ కార్యకర్తలు బండా ప్రకాశ్ సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేశారు.

మళ్లీ అశీర్వదించండి..
మళ్లీ అశీర్వదించండి వర్ధన్నపేట నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిద్దుతానని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్ నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమాలను నియోజకవర్గంలో ప్రతీ గడపగపడకు అందించానన్నారు. కార్యక్రమంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల సొసైటీ రాష్ట్ర చైర్మన్ కన్నెబోయి రాజయ్యయాదవ్, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, జెడ్పీటీసీ సభ్యులు సారంగపాణి, అరుణ జయాకర్, ఎంపీటీసీ మధు, స్వప్న, రాజమణి, ముదిరాజ్ నాయులు పల్లెబోయిన అశోక్, బుస్స మల్లేశం, ఇండ్ల నాగేశ్వర్‌రావు, మార్త సారంగపాణి, నూ నే భిక్షపతి, చొప్పరి సోమయ్య, సుధాకర్, ఎల్లయ్య, రాంమ్మోన్, కుమారస్వామి, దేవేందర్, వెంకటేశ్వర్లు, నాగయ్య, సుధాకర్, రాజు, సురేశ్, రాకేశ్, వెంకటయ్య, కొమురయ్య, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మునిగా సంపత్‌కుమార్, రవీందర్, చందర్‌రావు, జయపాల్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

మహాకూటమికి ఓటేస్తే తెలంగాణ ఆగమే..
హసన్‌పరి: మహాకూటమికి ఓటేస్తే తెలంగాణ ఆగమేనని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ అన్నారు. మండల కేంద్రంలోని సాయిని గార్డెన్స్‌లో సోమవారం మండల ముదిరాజ్‌ల ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఎల్లావుల లలితాయాదవ్, ఎంపీపీ కొండపాక సుకన్య జెడ్పీటీసీ సభ్యురాలు కొత్తకొండ సుభాశ్‌గౌడ్ పాల్గొన్నారు. అనంతరం సాయిని గార్డెన్స్‌లో జరిగిన సమావేశంలో బండా ప్రకాశ్ మా ట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ముదిరాజ్‌ల ఓట్లే టీఆర్‌ఎస్‌కు కీలకమన్నారు. ముదిరాజ్‌లకు రాజకీయాలలో మంచి భవిష్యత్తునిచ్చిన నేత కేసీఆర్ అని కొనియాడారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ముదిరాజ్ సంఘ నేతేనని, ఆయన రాజకీయాలలో కీలకమైన పదవిలో కొనసాగడం కేసీఆర్ చలువేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గడపగడపకు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగమల్ల ఝాన్సీలక్ష్మీ, నాయకులు పిట్టల కుమారస్వామి, శీలం సారయ్య, పిట్టల సదానందం, పెద్దమ్మ నర్సింహరాములు, జిర్ర కుమారస్వామి, జిర్ర అనిల్‌కుమార్, పెద్దమ్మ శ్రీనివాస్, జక్కు రమేశ్‌గౌడ్, నాగమల్ల సురేశ్, ఇండ్ల నాగేశ్వర్‌రావు, బండి రజనీకుమార్, అంచూరి విజయ్‌కుమార్, కొండపాక రఘుతో పాటు ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యు లు, మాజీ సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

187
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...