చెక్‌పోస్ట్‌లపై గట్టి నిఘా..!


Tue,November 13, 2018 02:02 AM

అధికారులను అలర్ట్ చేస్తున్న రిటర్నింగ్ అధికారి
వరంగల్, నమస్తేతెలంగాణ: ఎన్నికల ప్రక్రియలో తొలి ఘట్టం నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించకుండా అధికారులు గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన మూ డు చెక్‌పోస్ట్‌ల వద్ద ఏం జరుగుతోంది దానిని రిటర్నింగ్ అధికారి ప్రతిక్షణం పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడూ చెక్‌పోస్ట్‌ల వద్ద వి ధులు నిర్వహిస్తున్న అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి దానిని జీపీఎస్‌తో అనుసంధానం చేశారు. ప్రతీక్షణం రిటర్నింగ్ అధికారి వీపీ గౌత మ్ ఎక్కడా ఉన్నా ఆన్‌లైన్ ద్వారా చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీని పరిశీలిస్తున్నారు. బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చే సిన ఎలక్షన్ సెల్‌లో ప్రత్యేకంగా వీటి పర్యవేక్షణ కోసం టీవీలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆయన తన ల్యాప్‌టాప్‌లో, సెల్‌ఫోన్‌లో ప్రతీక్షణం చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ఎక్కడ ఉన్నా పరిశీలిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలకు వెహికిల్ ట్రాకింగ్ సిస్టంను ఏర్పాటుచేసి ఏ రూట్‌లో రోజుకు ఎన్ని కిలోమీటర్లు తి రుగుతున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.

అప్రమత్తమవుతున్న అధికారులు
రిటర్నింగ్ అధికారి చెక్‌పోస్టులపై నిఘా పెట్టడంతో విధుల్లో ఉన్న అధికారులు అప్రమత్తమయ్యారు. రెండు రోజుల క్రితం బ ల్దియా కార్యాలయంలో తనవద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో కమిషనర్ ఆన్‌లైన్ ద్వారా చెక్‌పోస్టుల వద్ద తనిఖీని పరిశీలిస్తున్న క్రమంలో ఒక చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయకుండానే వాహనం వెళ్లిపోతున్న దృశ్యాన్ని చూశారు. ఆయన వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తు న్న అధికారికి ఫోన్‌చేసి సదరు వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయలేదని ప్రశ్నించడంతో ఆ అధికారి ఖంగుతిన్నారు. కమిషనర్ అ నుక్షణం చెక్‌పోస్టుల వద్ద పనివిధానాన్ని పరిశీలిస్తున్న విషయాన్ని గ్రహించిన అధికారులు అనుక్షణం అలర్ట్‌గా ఉంటున్నారు.

232
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...