సర్వం సిద్ధం ..!


Mon,November 12, 2018 02:52 AM

-నేటి నుంచి నామిషన్ల స్వీకరణ ప్రారంభం
-మూడు నియోజక వర్గ కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటు
-ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు స్వీకరణ
-ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న జిల్లా ఎన్నికల అధికారి
అర్బన్ కలెక్టరేట్, నవంబర్ 11: శాసన సభ ఎన్నిల నిర్వహణకు జిల్లా యంత్రంగా సర్వం సిద్ధ్దం చేసింది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతోపాటు మౌళిక సదుపాయాలు కల్పించింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్డ్ ప్రకారం సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. దీంతో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఆయా నియోజక వర్గాల ఆర్‌వోల కార్యాలయంలో స్వీకరిస్తారు. నామినేషన్‌తో జత చేయాల్సిన డ్యాకుమెంట్లు ఇతర వివరాలను ఇప్పటికే ఎన్నికల కమిషన్ జారీ చేసింది. జిల్లాలోని మూడు నియోజక వర్గాలైన వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజక వర్గాలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించి వారికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో కొత్త ఈవీఎంలను ఏర్పాటు చేయడంతో నూతనంగా వీవీప్యాడ్‌లను అమలులోకి తీసుకువచ్చారు.

ఎన్నికల కోడ్ అమలులో భాగంగా జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ నిబందనల మేరకు ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టారు. నిఘా కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను ప్రత్యేక తనిఖీ బృందాలను నియమించారు. ప్లయింగ్ స్కాడ్స్, స్టాస్టికల్ సర్వేలెన్స్, మండల స్థాయిలో ఈ టీంలను నియమించి కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈ టీంలు మూడు షిప్టులలో విధులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడు నియోజక వర్గాలకు కలిపి 49 మందిసెక్టోరియల్ అధికారులను, వ్యయ పరిశీలకులను నియమించారు. పోలింగ్ సిబ్బందిని నియమించి త్వరలోనే వారికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం పోలింగ్ ప్రక్రియను అంతా వీడియోగ్రఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అభ్యర్థుల ప్రచార సామగ్రికి సంబంధించిన ధరలను కూడా నిర్ధారించారు. అలాగే నియెజక వర్గాలకు వ్యయపరిశీలకులను కమిషన్ నియమించింది. ఆదివారం ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా ఈవీఎంలు, వీవీ ప్యాడ్లను నియోజక వర్గలకు కేటాయించి పంపిణీ చేశారు.

జిల్లాలో పెరిగిన ఓటర్లు..
ఎన్నికల ప్రక్రయలో భాగంగా ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాపై దృష్టిసారించింది. తప్పులు లేని పక్కా ఓటర్ల జాబితాను రూపొందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 2018 జవనవరి ఒకటవ తేదీ వరకు 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటరుగా నమోదు చేయించడం, మార్పులు, చేర్పులు సరి చేయడంతో పాటు బినామీ ఓటర్లు, డుప్లికేటింగ్ ఓటర్లను తొలిగించే కార్యక్రమం చేపట్టారు. ఇందుకుగాను జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. గత సెప్టెంబర్ 10వ తేదీన 6,16,674 మంది ఓటర్లతో ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, ఆరోజు నుంచి 25వ తేదీ వరకు సప్లమెంటరీ సమ్మరీ రివిజన్ చేపట్టారు. ఆ తరువాత గత నెల 12వ తేదీని 6,59,548 మంది ఓటర్లతో జాబితాను వెల్లడించారు. ఈ పక్షం రోజుల్లో వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేట నియోజక వర్గాల్లో కలిపి మొత్తం42,874 మంది ఓటర్లు పెరిగారు. ఇందుకు ముఖ్య కారణం జిల్లా యంత్రాంగం వివిధ రకాలుగా చేపట్టిన కార్యక్రమాలు. వీరందరు డిసెంబర్ 7వ తేదీన జరిగే పోలింగ్‌లో ఓటు వేయనున్నారు. అంతేకాక నవంబర్ 9వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. వీరికి కూడా 7వ తేదీన ఓటు వినియోగించుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో ఈ నెల 9వ తేదీ వరకు సుమారుగా 12వేలకు పైగా యువత ఓటు హక్కు నమోదు చేసుకున్నారని, దీంతో జిల్లాలో 6.72లక్షల ఓటర్లు ఉండే అవకాశం ఉందన్నారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు..
ఎన్నికల సంఘం గత నెల 6వ తేదీన ఎన్నికల షెడ్యూల్డ్‌ను ప్రకటించింది. దీని ప్రకారం ఈ నెల 12వ తేదీన (నేడు) ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు 19 చివరి తేదీకాగా, 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 22వ తేదీని నిర్ణయించారు. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ ప్రక్రియ, 11వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.

264
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...