అథ్లెటిక్ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక


Mon,November 12, 2018 02:49 AM

వరంగల్‌స్పోర్ట్స్, నవంబర్11 : వరంగల్ అర్బన్ జిల్లా అథ్లెటిక్ సంఘం కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. హన్మకొండ అదాలత్ డీఐజీ బంగ్లా సమీపంలోని కాకతీయ కాన్ఫరెన్స్‌హాల్‌లో ఆ సంఘం సర్యసభ్యసమావేశం నిర్వహించారు. అథ్లెటిక్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వరద రాజేశ్వర్‌రావు, ప్రధాన కార్యదర్శిగా సారంగపాణి, కోశాధికారిగా పాపాయ్యతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్ సంఘం కార్యదర్శి సాయిలు, రిటర్నింగ్ అధికారిగా ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యాంప్రసాద్, అబ్జర్వర్‌గా ఒలంపిక్ సం ఘం బాధ్యుడు పవన్‌కుమార్, స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్‌గా కోచ్ శ్రీమన్నారాయ ణ వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ త్వరలో జిల్లాలో కమిటీల నియామకం చేపడతామని, అప్పటివరకు అడహాక్ కమిటీల పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వహిస్తామని అన్నారు.

213
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...