ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలు


Mon,November 12, 2018 02:49 AM

మట్టెవాడ, నవంబర్ 11: వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో రీజినల్ అగ్రికల్చర్ రిసెర్చ్ సెంటర్ (ఆర్‌ఏఆర్‌ఎస్) వద్ద ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. మట్టెవాడ సీఐ ఆధ్వర్యంలో ఆదివారం సెంటర్‌ను సందర్శించి అక్కడ సిబ్బంది పనితీరు తనిఖీల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాని సూచించారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానంగా ఉన్న ప్రతీ ఒక్క వాహనాన్ని, వ్యక్తిని కూడాడ తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా సోమవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంగా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద పరిస్థితిని, భద్రతను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో పకడ్బందీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పోలీసులకు రాజకీయ నాయకులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మట్టెవాడ సిబ్బంది పాల్గొన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...