ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం


Mon,November 12, 2018 02:49 AM

-52 సంవత్సరాల నాటి జ్ఞాపకాలను పంచుకున్న స్నేహితులు
-మహబూబియా హై స్కూల్ వేదిక..
వరంగల్ చౌరస్తా, నవంబర్ 11: వారంతా వివిధ రంగా ల్లో ఉన్నతాధికారులుగా, ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా రాణించి పదవీ విరమణ పొందారు. ఎవరికి వారు క్షణం తీరికలేని కార్యాచరణలో మునిగితేలిన వారే. వారందరూ చిన్న పిల్లలుగా మారి పాఠశాల రోజులను గుర్తు చేసుకోవడానికి ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జేపీఎన్ రోడ్డులోని మహబూబియా హై స్కూల్‌లో 1965-66 విద్యా సంవత్సరంలో హెచ్‌ఎస్‌సీ చదివిన విద్యార్థులు పాఠ శాల వేదికగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే బ్యాచ్‌కు చెందిన విశ్రాంత బ్యాంకు మేనేజర్ లక్ష్మీనారా యణ, ఎల్‌బీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సూర్య నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో ఆనాటి పూర్వ విద్యార్థులు పాల్గొని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. 52 సంవత్సరాల క్రితం విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు పాములపర్తి దామోదర్‌రావు, దేవా కోటేశ్వర్‌రావు, రామానుజాచార్యులుతోపాటు పాఠశాల కమిటీ అధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వర్లు, కార్యదర్శి విజయ్‌భాస్కర్, ఆనాటి ప్రధానోపాధ్యాయుడు బజారు హనుమంతరావు కుమారుడు శంభుప్రసాద్, ప్రస్తుత ప్రధా నోపాధ్యాయుడు బండారు కృష్ణారావును ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా ఆనాటి పాఠశాల ఉపాధ్యాయు లు మాట్లాడుతూ 52 సంవత్సరాల క్రితం తమ వద్ద చదు వుకున్న విద్యార్థులు పాఠశాల వేదికగా సమ్మేళనాన్ని ఏర్పా టు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆనాటి పాఠశాల ఆవరణలో జరిగిన బోధన విధానం, మేం చెప్పిన పాఠాలను గుర్తు చేసుకుంటే తిరిగి చాలా ఆనందంగా ఉందని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా అన్నారు. ఈ ఆపూర్వ కలయికకు గుర్తుగా పూర్వ విద్యార్థులు షీల్డ్‌లను అందజేశారు.

275
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...