క్రీడాకారులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి


Mon,November 12, 2018 02:48 AM

-ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
వరంగల్‌స్పోర్ట్స్, నవంబర్ 11 : క్రీడాకారులు తమ క్రీడాప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహి ంచాలని అంతర్జాతీయస్థాయి బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారిణి దీప్తి అన్నారు. జిల్లా బ్యాడ్మింటన్ సం ఘం ఆధ్వర్యంలో మూడు రోజులుగా హన్మకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్ వేదికగా జరుగుతు న్న రాష్ట్రస్థాయి అండర్-17 బాలబాలికల బ్యా డ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. క్రీడాకారులు తమ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ప్రణాళికతో ఆటలో శ్రమించాలని సూచిం చారు. బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి, నిర్వాహన కార్యదర్శి డాక్టర్ రమేశ్‌రెడ్డి, నాగకిషన్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో పాల్గొనేందుకు హాజరైన క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని వసతులు కల్పించామన్నారు. అనంతరం దీప్తిని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో వరంగల్‌క్లబ్ కార్యదర్శి ప్రే మ్‌సాగర్, పీవీవీ లక్ష్మి, వరంగల్ రూరల్ డీవైఎస్‌వో నరేందర్, రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోశాధికారి పాణిరావు, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి(ఏసీసీ), నరేశ్‌రెడ్డి(డీఎస్పీ), పోటీల అబ్జర్వర్ పీసీఎస్ రావు, సభ్యులు కొమ్ము రాజేందర్, శ్యాం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

153
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...