సమాజ మార్పు సాధ్యం


Mon,November 12, 2018 02:48 AM

-మహా నగర పాలక సంస్థ
-కమిషనర్ వీపీ గౌతమ్
కార్పొరేషన్/న్యూశాంపేట, నవంబర్ 11 : రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వినియోగం ద్వారానే సమాజ మార్పు సాధ్యమవుతుందని వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ వీపీ గౌతమ్ అన్నారు. ఆదివారం పబ్లిక్ గార్డెన్‌లో సులక్ష్యా సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాగో ఓటర్.. జాగో ఓటర్.. అవగాహన కార్యాక్రమానికి ఆయన ముఖ్య అథిగా హాజరై మాఇట్లాడారు. స్వచ్ఛమైన ఎన్నికతోనే స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం పరిడ విల్లుతుందన్నారు. ఓటు అమ్ముకుంటే మన మనస్సాక్షిని చంపుకున్నట్లేనని ఉద్ఘాటించారు. ప్రలోభాలకు లోనై ఓటును అమ్ముకుంటే ఎన్నికైన వారిని ప్రశ్నించే హక్కు కోల్పోతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటు విలువ తెలుసని, ఎంత దూరం వెళ్లయినా ఓటు వేస్తారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ రోజు ఒక సెలవు దినంగా భావించి, ఓటు వేయడంలో నిర్లిప్తత ప్రదర్శిస్తారని అన్నారు. ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఇది ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలన్నారు. ఓటుకు నోటు వలలో పడొద్దని, బహుమతులకు ఆశపడొద్దని సూచించారు. ఒక్క ఓటు వ్యవస్థను మార్చుతుందని, ఒక్క ఓటుతో గెలుపోటములు మారవచ్చన్నారు. ఎన్నికల అక్రమ నిరోధానికి గస్తి నిఘా, స్థిర నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోటీ చేసే అభ్యర్థి పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇదేకాక ఎన్వీఎస్పీ పోర్టల్‌లో కూడా తెలుసు కోవచ్చన్నారు. ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ-విజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మీ చుట్టుపక్కల అక్రమాలను అధికార యంత్రాంగం దృష్టికి తేవాలని గౌతమ్ కోరారు. డిసెంబర్ 7న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జాగో ఓటర్ జాగో కరపత్రాలు, ఓటరు అవగాహన పోస్టర్లను కమిషనర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేయూ మాజీ వీసీ గోపాల్‌రెడ్డి, కేయూ మాజీ రిజిస్ర్టార్ రంగారావు, ట్రైనీ ఐపీఎస్ రోహిత్, మాజీ సైనికులు మాణిక్యరావు, సులక్ష్య సేవా సమితి ప్రతినిధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

166
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...