ఘనంగా నాగమయ్య జాతర


Mon,November 12, 2018 02:47 AM

-భక్తి శ్రద్దలతో నాగదేవతకు పూజలు
- కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
- పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు
- పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
హసన్‌పర్తి, నవంబర్ 11 : నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని బొత్తలకుంట చెరు వు కట్టపై నాగమయ్య జాతర అత్యంత వైభవంగా జరిగింది. నాగమయ్య దేవాలయంలో ఆలయ చైర్మన్ వీసం పాపిరెడ్డి భక్తులకు సలక సౌకర్యాలు కల్పించారు. వేదపండితులు దహగం రమేశ్‌శర్మ వేదమంత్రోచ్చరణలతో నాగదేవతకు ప్ర త్యేక పూజలు నిర్వహించారు. నాగదేవత ప్రతిమకు పసుపు, కుంకుమలతో అర్చనలు, పాలాభిషేకం చేశారు. వివిధ ప్రాం తాల నుంచి భక్తులు నాగమయ్య దేవాలయానికి చేరుకొని నాగదేవతకు మొక్కులు చెల్లించుకొని పుట్టలో పాలు పోశారు. సంతానం లేని దంపతులు నాగదేవతకు వరం పట్టి సంతానా ప్రాప్తి కలిగించాలని వేడుకున్నారు.
భక్తులతో కిటకిటలాడి ఆలయ ప్రాంగణం
నాగుల చవితి వేడుకలను పురస్కరించుకొని నాగమయ్య జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మండల కేంద్రం నుంచి ఆలయ ప్రాంగణం వరకు కోలాటాలతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో ప్ర త్యేక పూజలు చేసి శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది.
కోరిన వారికి కొంగు బంగారం : ఝాన్సీలక్ష్మి
ప్రతి యేట నిర్వహించే నాగమయ్య జాతరకు రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుందని కార్పొరేటర్ నాగమల్ల ఝాన్సీలక్ష్మి అన్నారు. మండల కేంద్రంలోని బొత్తలకుంట కట్టపై నిర్వహించిన నాగమయ్య జాతరకు ఆమె హాజరై పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆమె మాట్లాడారు. అత్యంత పవిత్రమైన నాగమయ్య దేవాలయంలో ప్రతిష్ఠించబడిన నాగదేవత ఎంతో మహిమ కలిగినదన్నారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తిని ప్రసాదించడమే కాకుండా కోరిన వారిని కొంగుబంగారంగా వరాలిచ్చే దేవతగా భక్తులు విశ్వసిస్తారని తెలిపారు.

216
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...