కారుతోనే కూటమిని ఓడిస్తాం


Sun,November 11, 2018 05:22 AM

ధర్మసాగర్, నవంబర్ 10 : కారుతోనే మహాకూటమిని ఓడిస్తామని వరంగల్ పార్లమెంట్ సభ్యుడు పసునూరి దయాకర్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం రాత్రి ఆత్మీయ ఆశీర్వాద సమావేశంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాజయ్య గెలుపుకోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. మండలంలోని నారాయణగిరి, ముప్పారం, ధర్మసాగర్ గ్రామాల్లో ఆత్మీయ ఆశీర్వాద సమావేశం జరిగింది అనంతరం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలకేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణలో భాగంగా రైతులకు దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఉచితంగా 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నారు. రాష్ర్టాన్ని మరింతగా అభివృద్ధి చేయడం కోసం డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి మళ్లీ సీఎంగా కేసీఆర్‌ను గెలిపించడం కోసం మీరంతా మద్దతు ఇవ్వాలని కోరారు. కారు అడ్డుకునేందుకోసం నాడు తెలంగాణకు అడ్డుకున్న టీడీపీతో కాంగ్రెస్ మహాకూటమి పేరు రావడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ మహాకూటమిని ఎన్నికల్లో మీ ఓటుతో ఓడించాలని అన్నారు.

ఓటమి భయంతోనే..
ఓటమి భయంతో.. అధికార కోసం కాంగ్రెస్ పార్టీ మహాకూటమి పేర టీడీపీతో పొత్తులు పెట్టుకొని కుట్రలు చేస్తుందని దీనిని తెలంగాణ ప్రజలందరూ గ్రహించి మీ ఓటుతోనే కారు గుర్తుకు ఓటు వేసి కూటమిని కూలద్రోలాల న్నారు. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుమారు 45 ఏళ్లు, టీడీపీ 15 ఏళ్లు పాలన చేసిన రైతులను ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ముఖ్యంగా ధర్మసాగర్ నక్కల తుమూ కింద మిగిలిపోయిన కాల్వపనులను తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత పూర్తి చేసి 2300 ఎకరాలకు సాగునీరును అందజేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు రాజేశ్వర్‌రెడ్డి, బొడ్డు ప్రభుదాసు, రమణరెడ్డి, ఎం డీ లాల్, వీరన్న, వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్, ఎంపీపీ లక్ష్మి, వైఎస్ ఎంపీపీ కరంచంద్, సోమిరెడ్డి, ఎఎంసీ డైరెక్టర్ నిమ్మ కవితరెడ్డి, చాడ కుమార్, బొడ్డు సోమయ్య, పెద్ది శ్రీనివాసు, బుద్దె రమేష్, పుట్ట కుమారస్వామి, వెంకట్రాజం, ప్రసాద్, మహేందర్‌రెడ్డి, ఠాగూర్ అనురాధ, మాజీ సర్పంచ్ కోలిపాక రజిత, రమేష్ గౌడ్, బేరే హారీష్, జూబేద, రమాదేవి, యూత్ నాయకులు ఎర్రబెల్లి శరత్, దంతూరి చంద్రశేఖర్, రమేష్, మాచెర్ల సుదర్శన్, కుమారస్వామిగౌడ్, లసుమయ్య, పరకాల కుమారస్వామి, మహేష్, మండలంలోని కార్యకర్తలు, అనుబంధ సంఘల సభ్యులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిక..
వేలేరు మండలం సోడషపెల్లికి చెందిన కాంగ్రెస్, టీడీపీ లకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో టీఆర్‌ఎస్‌లో చేరినట్లు గ్రామ టీఆర్‌ఎస్ నాయకుడు శ్రీనివాస్ శనివారం రాత్రి తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో మాజీ ఎమ్మెల్యే రాజయ్యను ఇంట్లో కలిసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్శితులై టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన చిలుక దశరథం, మ్యాక సుదర్శన్, మ్యాక బుఛ్చయ్య, దార రాజయ్య, దయ్యాల సాయిలు, కీర్తి రమేష్, కొట్టె సంపత్, రాజేష్, గొర్రె భిక్షపతి, వెంకటయ్య, నరేష్‌తో పాటుగా పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు.

207
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...