మీ ఆశీర్వాదం కోసం వచ్చా..


Sun,November 11, 2018 05:22 AM

-అభివృద్ధిని చూసి ఓటు వేయండి
-ఎన్నికల ప్రచారంలో వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్‌భాస్కర్
-నందిహిల్స్‌కాలనీ అపార్ట్‌మెంట్ వాసుల మద్దతు
అర్బన్ కలెక్టరేట్, నవంబర్ 10 : ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ హంటర్‌రోడ్డు నందిహిల్స్ కాలనీలోని శ్రీజ, పూజా అపార్ట్‌మెంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంంగా అపార్ట్‌మెంట్ వాసులు, మహిళలు, వృద్ధులు బొట్టుపెట్టి వినయ్‌భాస్కర్‌కు స్వాగతం పలికారు. పూర్తి మద్దతు ప్రకటించారు. స్థానిక కార్పొరేటర్ కేశిరెడ్డి మాధవిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగర అభివృద్ధ్దిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రతి సంవత్సరం రూ.300 కోట్ల కేటాయించడం జరుగుతుందని చెప్పారు. మేము గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం. మీ ఆశీర్వాదం కోసం వచ్చాను ఓట్లు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. 2009లో గెలిచినప్పటి నుంచి ప్రజలలో ఒక మనిషిగా ఉంటూ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

మీలో ఒక వ్యక్తిగా సేవ చేసే అవకాశం కల్పించాలి
మీలో ఒక వ్యక్తిగా మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. మీరే కాకుండా మీ కుటుంబ సంబంధీకులతో ఓట్లు వేయించాలని ఆయన సూచించారు. అలాగే అపార్ట్‌మెంట్ వాసుల విజ్ఞప్తుల మేరకు పన్నుల విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగ్గించడం జరిగిందన్నారు. అంతేకాక నియోజక వర్గంలోని ప్రతి డివిజన్ పరిధిలో అభివృద్ధ్ది పనులు చేపట్టడం జరుగుతుందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా పనులు ఆపివేశారని, తరువాత ప్రారంభించిన పనులు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా అపార్టమెంట్ వాసులు టీఆర్‌ఎస్‌కే మా ఓటు వేయడంతో పాటు మా వంతుగా మరికొందరితో ఓట్లు వేయిస్తామని వినయ్‌భాస్కర్‌కు మద్దతు తెలిపారు. అనంతరం దాస్యం వినియ్‌భాస్కర్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుడా చెర్మన్ మర్రి యాదవరెడ్డి, స్థానిక కార్పొరేటర్ మాధవిరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సుందర్‌రాజ్‌యాదవ్, జిల్లా అపార్ట్‌మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషర్‌రెడ్డి, ఉపాద్యక్షుడు రాజేశ్వర్‌రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు వెంకన్న, జనరల్ సెక్రటరీ దేవులపల్లి నాగరాజు, అపార్ట్‌మెంట్ కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

212
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...