ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా..


Sat,November 10, 2018 01:30 AM

-మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
-బొల్లికుంటలో ఇంటింటి ప్రచారం
మామునూరు: ఎన్నికల్లో మరోమారు ఆశీర్వదించి, గెలిపి స్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గ్రేటర్ పరిధిలోని 5వ డివిజన్ బొల్లికుంటలో ఆయన శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, సీ ఎం కేసీఆర్ పేదల కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశాడని అన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకే ఓట్లు వేసి, కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధి చెంద లేదన్నారు. నాలుగున్నర ఏళ్లలో కోట్లాది రూపాయలు వె చ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పసునూరి స్వర్ణలత, వజ్రయ్య, టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పెరుమాండ్ల ఎల్లగౌడ్, తు మ్మ సాగర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సొత్తి భూమాతి, ఎంపీటీసీ వరలక్ష్మి, రాజగౌడ్, కీర్తి కుమారస్వామి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

160
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...