నాడు ఆటగాడు.. నేడు అతిథి..


Sat,November 10, 2018 01:30 AM

-జిల్లాతో చేతన్ ఆనంద్ అనుబంధం
-క్రీడలపై రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు
వరంగల్‌స్పోర్ట్స్, నవంబర్9: వందకుపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 22 టైటిల్ విన్నింగ్స్.. వరల్డ్ బెస్ట్ 10వ ర్యాంకర్.. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గ్రహీత.. వెరసి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ మాజీ క్రీడాకారుడు చేతన్ ఆనంద్. తన రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రీడా ప్రయాణంలో సాధించిన గొప్ప విజయాలు. 1992లో ఆటలో ఆరంగేట్రం చేసిన 15ఏళ్ల ప్రాయంలోనే ముంబైలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో తొలి విజయాన్ని అందుకున్న చేతన్ ఆనంద్ వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ వేదికగా 1995లో జరిగిన సీనియర్ ర్యాకింగ్ పోటీల్లో ప్రాతినిథ్యం వహించారు. నాడు జిల్లాతో అనుబంధాన్ని పెనవేసుకున్న ఆయన.. నేడు అదే వేదికపై ముఖ్య అతిథిగా హాజరై జిల్లాతో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో ముచ్చటించారు.

నాటి.. నేటికి చాలా వ్యత్యాసం..
క్రీడాకారుడి ప్రతిభ మెరుగుపడాలంటే కనీస వసతులు ఎంతో అవసరం. అలాంటి వసతుల విషయంలో నాటికి నేటికీ చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుత యువ క్రీడాకారులకు అకాడమీ రూపంలో, మీడియా ఇస్తున్న పాపులారిటీ, పోషకుల్లో తమ పిల్లలపై పెరుగుతున్న అలోచనా ధోరణి.. ఇలా చాలా విషయాల్లో మాకంటే చాలా బెటర్‌గా ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం సహకారం బాగుంది..
మిగతా రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్రీడలకు, ప్రతిభ చూపే క్రీడాకారులకు అండగా నిలుస్తోంది. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో విజయాలు సాధిస్తే వారికి అండగా నిలుస్తోంది. ఇలాంటి అవకాశాలను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకొవాలి.

వర్క్ హార్డ్.. ఎంజాయ్ స్పోర్ట్స్..
క్రీడాకారులు ఆటల్లో మొక్కుబడిగా ప్రాతినిథ్యం వహించకుండా స్పోర్ట్స్‌ను ఎంజాయ్ చేస్తూ హార్డ్ వర్క్ చేస్తే విజయాలు వరిస్తాయి. 1992లో క్రీడాకారుడిగా ప్రారంభమైన నా క్రీడాప్రయాణం రెండు దశాబ్దాల పాటు కొనసాగింది. ఈసమయంలో హర్డ్ వర్క్‌తోనే ఎన్నో విజయాలను సాధించాను. ప్రస్తుతం హైదరాబాద్‌లో 40మంది క్రీడాకారులతో బ్యాడ్మింటన్ అకాడమీని నిర్వహిస్తున్నాను. ఈటోర్నమెంట్‌లో అకాడమీ ప్లేయర్స్ 10మంది ఆడుతున్నారు.

241
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...