ఘనంగా నేతకాని దీపావళి బతుకమ్మ


Fri,November 9, 2018 03:17 AM

హసన్‌పర్తి, నవంబర్ 08 : మండలంలోని సీతంపేట నేతకాని కులస్తులు మూడు రోజుల పాటు వినూత్న రీతిలో నిర్వహించుకునే దీపావళి బతుకమ్మ వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి. దీపావళి పర్వదినం రోజున కుటుం బ సమేతకంగా కేదారీశ్వరస్వామి వ్రతాన్ని నిష్టగా నిర్వహించుకున్నారు. సాయంత్రం కుటుంబ యజమాని ఊరు శివారులోని కుంటలోని చెరువు మట్టిని సేకరించి కేదారీశ్వరస్వామి ఎదుట జోడెద్దులను తయారు చేశారు. వారు తయారు చేసిన జోడెద్దులకు వివిధ రకాల పిండి పదార్థాలతో తయారుచేసిన వంటకాలను నగల రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రెండో రోజు గురువారం సాయంత్రం కుటుంబ సమేతంగా కోలాటాలు, నృత్యాలతో జోడెద్దులను ఊరేగింపుగా ఊరు శివారులోని కుంటకు చేరుకున్నారు.
అనంతరం వారు వరుసక్రమంలో చెరు వు వెంట తెచ్చుకున్న పిండివం టలతో ఆరగింపు నిర్వహిం చి వరుస అయిన వారితో రంగులు, నీళ్లు చల్లుకొని సంబురాలు చేసుకున్నారు. తిరుగు ప్రయాణంలో వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మ ఏర్పాట్లు చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక దీపావళి..
తెలంగాణలో ప్రత్యేకతను సంతరించుకున్న దీపావళి నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మ వేడుకలు దీపావళి పర్వదినం బుధవారం నుంచి ప్రారంభంకానున్నా యి. నేతకాని కులస్తులు దీపావళి పర్వదినం రోజు నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవ వేడుకల్లో భా గంగా కేదారీశ్వర వ్రతాన్ని నిర్వహించుకొని రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి దీపావళి బతుకమ్మ వేడుకలను నిర్వహించుకుంటారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచా రం కేవలం తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క వరంగల్ జిల్లాలోనే కొనసాగడం ఇక్కడి విశేషం.

వలస జీవుల వినూత్న పండుగ..
మహరాష్ట్ర నుంచి వలస వచ్చిన నేతకానిలు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో ప్రతియేట నిర్వహించే నేతకా ని కులస్తుల బతుకమ్మ వేడుకలకు ఇక్కడ ప్రత్యేకత ఉంది. సాదారణంగా సద్దుల బతుకమ్మను 9 రోజుల పాటు నిర్వహిస్తే నేతకాని కులస్తుల దీపావళి బతుకమ్మను మూడు రోజుల నిర్వహించే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

మొదటి రోజు జోడెద్దుల నిమజ్జనం
దీపావళి పర్వదినం మొదటి రోజున నేతకాని కులస్తులు కేదారీశ్వర వ్రత సంకల్పంలో భాగంగా బుధవారం కుటుం బ సభ్యులు నిష్టగా వ్రతాన్ని నిర్వహించారు. ఇదే రోజు సా యంత్రం ఊరు శివారులోని కుంటలో రాగడి మట్టిని తీసుకువచ్చి ఎద్దుల విగ్రహ ప్రతిమలను తయారు చేశారు. మ రుసటి రోజు గురువారం ఇంటి యజమాని ఉపవాస దీక్ష తో పిండి పదార్థాలతో రకరకాల వంటలను తయారు చేసి ఎద్దులకు అలంకరించారు. కేదారీశ్వరుడి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. నేతకాని కుల పెద్దలు కేదారీశ్వరుడికి మొక్కులు చెల్లించి ప్రత్యేకంగా తయారు చేసిన పిండి వంటలను ఎద్దులకు అలంకరించారు. పురుషులు మాత్రమే ఈ ఉత్సవంలో పాల్గొని ప్రత్యేకంగా త యారు చేసిన ఎద్దుల ప్రతిమలకు పసుపుకుంకుమలతో అ భిషేకం నిర్వహించారు. పురుషులు ఎద్దుల ప్రతిమలతో కోలాటాలతో ఆటపాటలతో ఊరేగింపు నిర్వహించి ఊరు శివారులోని కుంటకు చేరుకున్నారు. కుంటలో వారు తమ వెంట తె చ్చుకున్న పిండి వంటలను గంగమ్మకు ఆరగింపు చేసి ఎద్దుల ప్ర తిమలను కుంటలో నిమజ్జనం చేశారు. అ నంతరం వరుసైన వా రు రంగులు చల్లుకొ ని సంబురాలు జరుపుకున్నారు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం నిర్వహించే బతుకమ్మకు దారివెం ట ఉన్న పూలను సేకరించి ఇంటికి పయణమయ్యారు.

నేటితో ముగియనున్న వేడుకలు
నేతకాని కులస్తు లు మూడు రోజుల పాటు నిర్వహించి దీ పావళి బతుకమ్మ వే డుకలు శుక్రవారం సాయంత్రంతో ముగియనున్నాయి. ఈ వేడుకలలో చివరి రో జైన శుక్రవారం మహిళలు ప్రత్యేకంగా మట్టికుండపై బతుకమ్మ ను పేర్చి వేడుకలను నిర్వహిస్తారు. రాష్ట్రంలో కేవలం ఒక్క వ రంగల్ జిల్లాలోనే నిర్వహించే ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేసి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని నేతకాని కులస్తులు కోరుతున్నారు.

190
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...