మరోసారి ఆశీర్వదించండి..


Fri,November 9, 2018 03:16 AM

హన్మకొండ రూరల్, నవంబర్ 08: ముస్లిం మైనారిటీలను గత ప్రభుత్వాలు ఏనాడూ పట్టిం చుకోలేదని టీఆర్‌ఎస్ వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ ఆరోపించారు. హన్మకొండ, హసన్ పర్తి మండలాల ముస్లిం మైనారిటీల ఆశీర్వాద సభ గురువారం గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ ఆరెపల్లిలోని వజ్ర గార్డెన్‌లో జరిగింది. మైనారిటీ సెల్ వర్ధన్నపేట నియోజకవర్గ అధ్యక్షుడు షేక్ ఆదం ఆధ్వర్యంలో జరిగిన సభలో అరూరి రమేశ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రాజకీయంగా ముస్లింలకు ఏనాడూ సరైన ప్రాధాన్యం ఇవ్వలేద న్నారు. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ప్రకా రం మహమూద్ అలీకి ఉప ముఖ్య మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. కానుకలు, షాదీముబారక్, ప్రత్యేక గురుకులాలను ముస్లింలకు ఏర్పాటు చేశా రని చెప్పారు. నాలుగున్నర ఏళ్లలో వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుం డాకృషి చేశానని, మరోసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని రమేశ్ కోరారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ మౌలానా యూసఫ్ జాహి మాట్లా డుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ముస్లింలకు పిలుపు నిచ్చారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయని చెప్పారు. ఏనాడూ ముస్లింల అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. ముస్లిం మైనారి టీలకు చేయూతనిచ్చిన టీఆర్‌ఎస్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థు లను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. సభలో మైనారిటీ రాష్ట్ర నాయకుడు ఉస్మాన్ అలీ, జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ అజీజ్‌ఖాన్, 1, 58వ డివిజన్ల కార్పొరేటర్లు వీర భిక్షపతి, బానోతు కల్పన, హసన్‌పర్తి మైనా రిటీ సెల్ నాయ కులు వహీద్‌అలీ, అంకు శావలి, అహ్మద్ పాషా, సలీం, అఫ్జల్, తాజుద్దీన్, గౌసియా, జుబేదా, టీఆర్‌ఎస్ మండల నాయ కులు బుద్దె వెంకన్న, డివిజన్ అధ్యక్షుడు రాజు, గ్రామశాఖ అధ్యక్షుడు బొమ్మ తిరుమల్‌గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.

12వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్దిదిద్దుతా
కాశీబుగ్గ : గ్రేటర్ వరంగల్‌లోని 12వ డివిజన్‌ను ఆదర్శ వంతగా తీర్చిదిద్దుతానని మాజీఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. 12వ డివిజన్‌లోని బాలాజీనగర్‌లో బుధవారం నిర్వ హించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని కోరారు. కేసీఆర్ హయాంలోనే బడుగు, బలహీన, మైనారిటీ వర్గాలు అభివృద్ధి చెందాయని అన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. త్వరలోనే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు అందుతుందని చెప్పారు. బాలాజీనగర్‌లో మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాల్, మోడల్ శ్మశానవాటికను నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చా రు. ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. గతంలో ఆదరించినట్లే ఈసారి కుడా ఆదరించి అధిక మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. అరూరి రమేశ్‌కే ఓటు వేస్తామని బాలాజీనగర్ వాసులు ప్రతిజ్ఞ చేశారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజు, నాయకులు తూర్పాటి సారయ్య, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ముడుసు నరసింహ, పత్రి సుభాష్, గండ్రాతి భాస్కర్, గంధం గోవింద్, జంగం రాజు, మల్లయ్య, యాదగిరి, రాజశేఖర్, స్వామి పాల్గొన్నారు.

బాంబు పేలుళ్ల బాధితుడికి పరామర్శ
కోటి లింగాల దేవాలయ రోడ్డులోని భద్రకాళి ఫైర్‌వర్స్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో గాయపడిన బాలాజీనగర్‌కు చెందిన కొండపల్లి సురేష్‌ను ఆరూరి రమేశ్ పరామర్శించారు. ప్రభు త్వం నుంచి వచ్చే పథకాలు అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...