త్వరలోనే ఎంపీడీవోలకు పదోన్నతులు


Wed,September 12, 2018 03:08 AM

- ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచిప్రభుత్వానికి చేరిన 20 మంది జాబితా
- సాకారం కానున్న 20 ఏళ్ల కల
సుబేదారి, సెప్టెంబర్ 11: ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీడీవోల పదోన్నతికి లైన్ క్లియర్ అయింది. మండల వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు పదోన్నతులు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 సంవత్సరాల నుంచి ఎంపీడీవోలు పదోన్నతులకు నోచుకోకుండా ఆదే హోదాలో పనిచేస్తున్నారు. గత పాల కుల నిర్ణక్ష్యం, పట్టింపులేకపోవడం వల్లే వీరికి ప్రమోషన్లు లభించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవం తర్వాత గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఎంపీడీవోల సేవలను గుర్తిస్తూ వారు అడగకుండానే సీఎం కేసీఆర్ పదోన్నతులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతులకు సంబంధించిన ఫైల్‌పై కూడా సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో ఎంపిడీవోలు ఆనందంతో మునిగితేలారు. సీనియార్టీలో ఇబ్బందులను తొలగిస్తూ ఎలాంటి అడ్డంకులు లేకుండా పదోన్నతి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం 35 జీవోను జారీ చేసింది. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించినప్పటికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ అంశాలపై మరోమారు సీఎం కేసీఆర్ సమీక్ష చేసి రాష్ట్రంలో అర్హత ఉన్న 130 మందికి పదోన్నతులు కల్పించడానికి అధికారికంగా తుది నిర్ణయం తీసుకొని ఫైల్‌పై సంతకం చేయడంతో లైన్ క్లియర్ అయింది. వారం, పది రోజుల్లో ఉమ్మడి వరంగల్ నుంచి ఎంత మందికి పదోన్నతులు వస్తాయనేది తేలనున్నది.

ఆరు విభాగాల్లో పదోన్నతులు
ఎంపీడీవోలకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు విభాగాల్లో పదోన్నతులు కల్పించనున్నది. పంచాతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో జెడ్పీ డిప్యూటీ సీఈవో, డీఆర్‌డీవో, పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి, ఫైనాన్స్ కమిషనర్, ఈజీఎం అదనపు పీడీ, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ వంటి సీనియర్ పోస్టులకు అర్హత లభిస్తుంది.

ప్రభుత్వానికి చేరిన 20 మంది జాబితా
ఎంపీడీవోల పదోన్నతి విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి సీనియార్టీ ఉన్న 20 మంది జాబితా జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ శాఖ నుంచి రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సీనియార్టీ ప్రకారం ఎంపీడీవోల పూర్తి వివరాలు, సర్వీస్‌లో చేరినప్పటినుంచి ఎక్కడెక్కడ పనిచేశారు? ఏమైనా ఆరోపణలు గానీ, కేసులు గానీ ఉన్నాయా? విధి నిర్వహణలో పనితీరు, రిమా ర్క్స్ వంటి సమాచారం అన్వల్ కాన్ఫిడెన్సీ రిపోర్టు(ఏసీఆర్) నివేదికను పదోన్న తికి అర్హత ఉన్న ప్రతి ఒక ఎంపీడీవో వారీగా జాబితాను జిల్లా పరిషత్ నుంచి తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...