టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం..


Wed,September 12, 2018 03:06 AM

-టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత గుడిమళ్ల రవికుమార్
సుబేదారి, సెప్టెంబర్ 11 : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్ అన్నారు. మంగళవారం హన్మకొండ నక్కలగుట్ట హరితహోటల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంగా తెలంగాణ సాధన కోసం ముందుండి పోరాడినట్లు చెప్పారు. న్యాయవాదులను, ఆటోడ్రైవర్లను ఉద్యమంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌లో క్రమశిక్షణ గల కార్యకర్తగా నిబద్దతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2014 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేసినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవడానికి శక్తివంచనలేకుండా పనిచేస్తానన్నారు. 50వేల ఆటో డ్రైవర్లు, 5 వేల ట్రాలీ, టాటా ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లందరూ సమష్టిగా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనుబంధ సంఘాల సమావేశాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుపై చర్చించుకున్నామని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఏది ఆదేసిస్తే ఆమేరకు పార్టీకోసం పనిచేస్తాను. నాభవిష్యత్ సీఎం కేసీఆర్ చూసుకుంటారని అన్నారు. సమావేశంలో గ్రేటర్ వరంగల్ ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు ఎండీ యాకూబ్, ట్రాలీ వాహన డ్రైవర్స్ సంఘం అధ్యక్షుడు వీరస్వామి, రామారావు, న్యాయవాది విజయ్‌కుమార్, బీసీసం ఘం నాయకుడు జయరాం, మైనార్టీ సంఘం నాయకుడు అన్వర్, టెక్నికల్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు అక్షమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు

171
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...