అభివృద్ధే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తుంది


Wed,September 12, 2018 03:06 AM

-డబ్బు సంచుల కోసమే పొత్తులు
-తూర్పు,పశ్చిమలో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు తథ్యం
-కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి
కాజీపేట, సెప్టెంబర్ 11 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్దే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తాయని కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాజీపేట మీడియా పాయింట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాను న్న అసెంబ్లీ ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేసి పొత్తులను కుదుర్చుకోవడం అప్రజాస్వామికం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని బహిరంగంగానే వ్యతిరేకించిన టీడీపీ అధినేత, ఆంధ్ర సీఎం చంద్రబాబుతో పొత్తులకు పోవడం సిగ్గుచేటన్నారు. డబ్బు సంచుల కోసమే పలు పార్టీలు మహాకూటమిగా మారుతున్నాయని అన్నారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో దాస్యం వినయ్‌భాస్కర్ అభివృద్ధి చేశారన్నారు. వరంగల్ తూర్పు అ భ్యర్థిగా ఎవరిని ప్రకటించినా 2014లో వచ్చిన మెజార్టీకంటే అధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా తూర్పు, పశ్చిమలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు కాటాపురం రాజు, రైతు సమన్వయ కమిటీ సభ్యుడు సుంచు కృష్ణ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేశ్, శిరుమల్ల దశరథం, నాయకు లు సురేశ్‌బాబు, బొర్ర అయిలయ్య, సిరిల్ లారెన్స్, రావుల సదానందం, నజీరుద్దీన్, శివకుమార్, సయ్యద్ రజాలీ, ఫర్హన్, భిక్షపతి, పాము రాజేశ్, హమూద్ పాల్గొన్నారు.

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...