ఆవిష్కరణలే ముందుకు నడిపిస్తాయి


Wed,September 12, 2018 03:05 AM

-కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్
-నిట్‌లో నూతన భవనాల ప్రారంభోత్సవం
నిట్‌క్యాంపస్, సెప్టెంబర్ 11 : ఉన్నతంగా చేసే ఆలోచనలు, విభిన్న ఆవిష్కరణల వల్లే భారతదేశం అభివృద్ధి పథా న నడుస్తోందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ అన్నారు. నిట్‌లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు ఒక గొప్ప ఆలోచనలు, ఆవిష్కరణలతోనే ముందుకు సాగాలని సూచించారు. మంగళవారం నిట్‌లో నూతనంగా నిర్మించిన నాలుగు అకడమిక్ భవనాలను ఆయన ప్రారంభించారు. నూతనంగా ప్రారంభించిన అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌లో కేంద్రమంత్రి మా ట్లాడారు. దేశంలో వరంగల్ నిట్‌కు ఉన్నత స్థానం ఉందని తెలిపారు. నాణ్యతతో ఉన్నతమైన ర్యాంకు సాధించిన నిట్ వరంగల్ నాకు చాలా నచ్చిందని తెలిపారు. పచ్చని చెట్లతో నిండిన క్యాంపస్ ఆరోగ్యకరంగా, శ్రేష్ఠ భారత్‌లా ఉందని కొనియాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణల సంస్కృతికి నాంది పలకాలని, ఐడియాలతో దేశాన్ని గొప్ప అభివృద్ధి పథంలోకి తీసుకుపోవచ్చని చెప్పారు. తైవాన్ లాంటి చిన్నదేశం కంప్యూటర్ చిప్‌ల తయారీతో ముందుకు దూసుకు పోతోందని తెలిపారు. మనం కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్ సాంకేతికతతో అనేక అంశాల్లో డిజిటల్ సమస్యలను సాధిస్తున్నాం అని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు గతంలో కంటే 70శాతం ఎక్కువ నిధులు కేటాయించే విధంగా ప్రధానిని ఒప్పించినట్లు జవదేకర్ తెలిపారు. ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహకంగా లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నామని తెలిపారు. ల్యాబ్‌లు, మంచి అధ్యాపకులు, ఆధునిక సౌకర్యాలు ఉంటే నిట్‌లలో మంచి విద్యార్థులు తయారవుతారని అన్నారు. ప్రతిభావంతులు విదేశాల్లో కాకుండా ఇక్కడే పరిశోధనలు చేస్తే అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని స్పష్టం చేశారు. అనంతరం నిట్‌లో స్వచ్ఛభారత్ ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపిన పలువురు విద్యార్థులకు కేంద్రమంత్రి నగదు బహుమతులు అందజేశారు.

డైమండ్‌జూబ్లీకి ఉపరాష్ట్రపతి
-నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు
అక్టోబర్‌లో నిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డైమండ్‌జూబ్లీ ఉత్సవాలకు భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు హాజరవుతారని నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. అక్టోబర్ 8న నిట్‌లో ఉపరాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అక్టోబర్ 9న రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో పాలు పలువురు ప్రముఖులు పాల్గొంటారని అన్నారు. నిట్ వరంగల్‌లో విద్య, పరిశోధన, ప్లేస్‌మెంట్లలో ఉన్నతమైన ప్రతిభ చూపుతోందని తెలిపారు. విదేశీ ఒప్పందాలు, అకడమిక్ కార్యక్రమాలు, ర్యాంగ్ ఫ్రీతో విద్యార్థులకు మంచి క్యాంపస్ వాతావరణాన్ని నిర్మించామని చెప్పారు. అనంతరం డైరెక్టర్ కేంద్ర మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌కు జ్ఞాపిక, మొక్కతో సత్కరించారు.
నూతన భవనాలకు శంకుస్థాపన
కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్ నిట్‌లో నిర్మించిన పలు అకడమిక్ భవనాలను మంగళవారం ఉదయం ప్రారంభిం చారు. కేంద్రమంత్రి ఉదయం హెలీక్యాప్టర్ ద్వారా ఢిల్లీ నుండి నిట్ స్టేడియంకు చేరుకున్నారు. అక్కడే కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, పలువురు బీజేపీ నాయకులు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం నేరుగా నిట్‌లోని మెటలర్జీ సైన్సెస్ భవనం, కెమికల్ ఇంజినీరింగ్ భవనంతో పాటు సెమినార్ హాల్స్ కాంప్లెక్స్, అంబేద్కర్ లర్నింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. నూతన భవనాల ఎదుట కేంద్రమంత్రి నిట్ డైరక్టర్‌తో కలిసి మెక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ప్రాజెక్ట్‌వర్క్స్ అధికారి ఎన్‌ఎన్‌ఎస్ రావు, ఏపీ నిట్ డైరెక్టర్ సీఎస్‌పీ రావు, నిట్ డీన్‌లు, ప్రొఫెసర్ పాపిరెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు ధర్మారావు, అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...