దేశానికే తెలంగాణ ఆదర్శం


Tue,September 11, 2018 02:32 AM

-సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థ్థానం
-సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనం
-అస్థిర పరిచే శక్తులను అడ్డుకునేందుకే ఎన్నికలు
-కార్యకర్తలు సమాయత్తం కావాలి
-టీఆర్‌ఎస్ తూర్పు నియోజకవర్గ సమావేశంలో ఎంపీ బండా ప్రకాశ్
అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ఇందుకోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అందరూ అండగా నిలవాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసంపాటుపడుతున్న తెలంగాణ సర్కార్‌పై విపక్షాల కుయుక్తులను తిప్పికొట్టాలని కోరారు. సోమవారం వరంగల్ హంటర్ రోడ్‌లోని సీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎంపీలు అజ్మీరా సీతారాంనాయక్, పసునూరి దయాకర్, వరంగల్ పశ్చిమ తాజామాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య తదితర ముఖ్యనేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే శక్తులను అడ్డుకునేందుకే సీఎం కేసీఆర్ ప్రజాతీర్పునకు సిద్ధమయ్యారని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో చర్చించిన అనంతరమే అసెంబ్లీని రద్దు చేశారని, అనంతరం 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించి దేశ చరిత్రలోనే సంచలనం సృష్టించారని, ఇది సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని బండా ప్రకాశ్ పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపుకోసం శ్రమించాలని పిలుపునిచ్చారు.

వరంగల్ నమస్తేతెలంగాణ/ న్యూశాయంపేట, సెప్టెంబర్ 10 : కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నాలుగేళ్లలోనే దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానంలో నిలిచిందని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. సోమవారం హంటర్‌రోడ్‌లోని సీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో మేయర్ నన్నపునేని నరేందర్ అధ్యక్షతన జరిగిన తూర్పు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాబోయే ఎన్నికలకు సమాయత్తం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉద్యమ స్ఫూర్తితో టీఆర్‌ఎస్ గెలుపుకోసం శ్రమించాలన్నా రు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూనే వారిలో మనోైస్థెర్యా న్ని నింపారు. నాలుగేళ్లలోనే దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శనమన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా చూస్తోందని, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజాప్రతినిధుల బృందాలను ఇక్కడి అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు పంపించడం తెలంగాణ ప్రగతిని నిదర్శనమన్నారు.

పద్నాలుగేళ్ల పోరాటం ఫలితంగా సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమం లో కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఆయన అన్నారు. సుస్థిర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే శక్తులను అడ్డుకునేందుకే ఎన్నికలకు సిద్ధమయ్యామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో చర్చించిన అనంతరమే ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఆయన కార్యకర్తలకు వివరించారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన మరుక్షణంలోనే 105 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించడం దేశ చరిత్రలోనే మొదటి సారి అని, ఇది సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. నగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులను కేటాయించి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు. కొండా దంపతులది రాజకీయ ఆత్మహత్యగా అభివర్ణించారు. తప్పులు చేసిన వారికి సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తూ టికెట్ పెండింగ్‌లో పెడితే కొండా దంపతులు ఓపిక లేకుండా కేసీఆర్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజకీయ పునర్జన్మనిచ్చిన టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శించే నైతికత కొండా దంపతులకు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కార్యకర్తల్లో ఉత్సాహం ..
నాలుగేళ్ల తరువాత జరిగిన తూర్పు నియోజకవర్గ స్థా యి కార్యకర్తల సమావేశం కార్యకర్తల్లో ఉత్సాహం నింపిం ది. ఎన్నికల సమయంలో జరిగిన ఈ సమావేశంలో నాయకుల స్ఫూర్తిదాయక ప్రసంగాలు, కార్యకర్తలకు ఊపు తీసుకువచ్చింది. అభ్యర్థులు ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యమం టూ నాయకుల ప్రసంగాలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. అంతా కేసీఆర్ నేతృత్వంలోనే పనిచేయాలన్న సంకేతాలను సమావేశంలో నేతలు ఇచ్చారు.

పిట్టకథలతో ఆకట్టుకున్న ఎంపీ దయాకర్
తూర్పు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎంపీ పసునూరి దయాకర్ పిట్టకథలతో కార్యకర్తలను ఉత్సాహ పరిచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని దానికి అనుగుణంగానే ఆయన సమావేశంలో పిట్టకథలు చెప్పారు. ఎవరు పార్టీని వదిలినా నష్టం లేదని కార్యకర్తలే పార్టీకి ప్రాణం అంటూ ఆయన పిట్టకథల ద్వారా వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు ఎంబాడి రవీందర్, బైరబోయిన దామోదర్ యాదవ్, కుందారపు రాజేందర్, గుండా ప్రకాశ్‌రావు, వద్దిరాజు గణేశ్, బయ్యా స్వామి, కేడల పద్మ, యెలుగం లీలావతి, మరుపల్ల భాగ్యలక్ష్మి, రిజ్వానా మసూద్, శారదాజోషి, వీర భిక్షపతి, బానోతు కల్పన, బసికె శ్రీలేఖ, కేతిరెడ్డి మాధవరెడ్డి, నల్లా స్వరూపరాణి, పసునూరి స్వర్ణలత, వస్కుల రాధిక, బిల్లా కవిత, మాజీ కార్పొరేటర్లు బత్తిని వసుంధర, నాగపూరి కల్పన, దండు దయాసాగర్, బాసాని శ్రీనివాస్, గుండేటి నరేందర్, పల్లం రవి, నాయకులు శామంతుల శ్రీనివాస్, ఎండీ మసూద్, జారతి రమేశ్, నాగపూరి సంజయ్‌బాబు, వొగిలిశెట్టి అనిల్‌కుమార్, నీలం రాజ్‌కిశోర్, గుండు పూర్ణచందర్, డాక్టర్ పోలా నటరాజ్, తూర్పు జేఏసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

125
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...