కాంగ్రెస్ పాలనలో రౌడీలే రాజ్యమేలారు


Tue,September 11, 2018 02:31 AM

నయీంనగర్, సెప్టెంబర్ 10: కాంగ్రెస్ అంటేనే రౌడీలు, భూ కబ్జాదారులతో నిండిపోయిన పార్టీ అని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. సోమవారం 40వ డివిజన్‌లోని డైమం డ్ ఫంక్షన్ హాల్‌లో 40,43,31,27,47 డివిజన్ల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభకోణాలు, అవినీతితోనే కాలం గడిపారని మం డిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం కొలువుదీరిన నాటి నుంచి నేటి వరకూ అవినీతి మకిలి అంటకుండా పాలన సాగించిందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పొందాలంటే మరోసారి ఆదరించాలన్నా రు. ఈ సందర్భంగా 70 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్‌లను ఎంపీలు దయాకర్, సీతారాంనాయక్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి అందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు తాడిశెట్టి విద్యాసాగర్, స్వరూపరాణిరెడ్డి, వద్దిరాజు గణేశ్, దేవేందర్, టీఆర్‌ఎస్ నాయకులు చెన్నం మధు, పున్నం, తదితరులు పాల్గొన్నారు.

వేదిక కిందనే దాస్యం
ప్రభుత్వం రద్దుతో తాజా మాజీ ఎమ్మెల్యేగా మారిన దాస్యం వినయ్‌భాస్కర్ స్టేజీ కిందనే ఆశీనులయ్యారు. ప్రభుత్వం అధికారంగా నిర్వహించే కార్యక్రమం కావడంతో సాధారణ టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...