కంటి పరీక్షలు @ 65,241


Tue,September 11, 2018 02:30 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 10: కంటి వెలుగు పథకంలో భాగంగా సోమవారం 65,241 మందికి కంటి స్క్రీనింగ్ నిర్వహించారు. 15,876 మందికి కంటి అద్దాలు అందించారు. ఇంకా 19,321 మందికి కళ్లద్దాలు ఇవ్వాల్సి ఉంది. పరీక్షలు, ఆపరేషన్ కోసం 8418 మందిని రెఫర్ చేశామని, 258 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్ తెలిపారు.

2800 మందికి పరీక్షలు
కరీమాబాద్: ఎస్‌ఆర్‌ఆర్ తోటలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసి కంటి వెలుగు శిబిరంలో ఇప్పటి వరకు 2800 మందికి కంటి పరీక్షలు చేశారు. సోమవారం 211 మంది రాగా.. వైద్యులు పరీక్షలు నిర్వహించి 121 మందికి అద్దాలను అందజేశారు. ఈ సెంటర్‌లో రోజురోజుకూ ఓపీ పెరుగుతుందని వైద్యులు తెలిపారు. వైద్యు లు సురేశ్, దేవదాస్ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది అర్బన్‌హెల్త్ సెంటర్ల తెలంగాణ రాష్ట్ర కోశాధికారి రామారాజేశ్ ఖన్నా, నర్సయ్య, మంజుల, వాణి, మోనా, సంధ్య, రాణి, జ్యోతి, పద్మ, వీణ తదితరులు పాల్గొన్నారు.

కంటి వెలుగును సద్వినియోగించకోవాలి
కాశీబుగ్గ: సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రా రంభించిన కంటి వెలుగు పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని 29వ డివిజన్ కార్పొరేటర్ కావాటి కవితాయాదవ్ సూచించారు. సోమవారం దేశాయిపేట్‌లోని అర్బన్ హెల్త్ సెంటర్‌ను సందర్శించి కంటి వెలుగులో పాల్గొన్న ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ఎంత మందికి వైద్య పరీక్షలు చేశారని, అద్దాల పంపిణీ, ఆపరేషన్‌కు రెఫర్ చేసిన వైద్యుల నుంచి వివరాలను సేకరించారు. అనంతరం అద్దాలు, మందులు పంపిణీ చేశారు.

184
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...