మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలి


Mon,September 10, 2018 03:27 AM

మడికొండ, సెప్టెంబర్ 09 : మహిళలు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర మహిళా కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుండు సుధారాణి సూచించారు. మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం)లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం అరవై రోజుల పాటు నిర్వహించిన ఉచిత శిక్షణ కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉచితంగా శిక్షణ పొంది పోటీ పరీక్షలకు సన్నద్ధమైన ప్రతీ ఒక్కరికి ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. శిక్షణలో భాగంగా మంచి వసతి, ఫ్యాకల్టీని అందించామని అన్నారు. రాష్ట్రంలో మడికొండ ప్రాంగణంలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని శిక్షణ ఇవ్వడం జరిగిందని, ముందుముందు అన్ని ప్రాంగణాల్లో ఇలాంటి సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

సీఎం కేసీఆర్ కార్పొరేషన్‌కు రూ.75కోట్లు నిధులు కేటాయించడం వల్లే ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. హన్మకొండ ఏసీపీ సదానందం మాట్లాడుతూ సబ్జెక్టుపై అవగాహన పెంచుకుని పట్టుదలతో నిరంతరం కృషి చేస్తే విజయం మీదేనని సూచించారు. అనంతరం శిక్షణ పొందిన అభ్యర్థులు గుండు సుధారాణిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కాగా, 70మంది వీఆర్వో, 120మంది కానిస్టేబుల్స్, 30మంది ఎస్సై, 30మంది పంచాయతీ సెక్రటరీ పోస్టులకు శిక్షణ పొందారు. అలాగే ఆమె చేతుల మీదుగా ఫ్యాకల్టీని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ జయశ్రీ, ఫ్యాకల్టీ చిట్టి, రమేశ్, చిరంజీవి, కరీంరాజు, లక్ష్మణ్, ప్రశాంత్, రాజేందర్, సైదులు, కో-ఆర్డినేటర్ స్వప్న, సీడీపీవో శిరీష తదితరులు పాల్గొన్నారు.

179
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...