ఆర్‌టీసీ ఆర్‌ఎం కార్యాలయంలో..


Mon,September 10, 2018 03:26 AM

సుబేదారి : హన్మకొండ బస్‌స్టేషన్ వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఎం సూర్యకిరణ్, డివీఎంలు రాములు, అపర్ణకల్యాణి, డిపో మేనేజర్లు సురేష్, హర్పిత, భానుప్రసాద్, సిబ్బంది కాళోజీ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈసందర్భంగా తెలంగాణ శ్వాసగా కాళోజీ నారాయణరావు జీవించారని కొనియాడారు. ఆయన మార్గదర్శకంలో అందరూ తెలంగాణ అభివృద్ధిలో ముందుకుసాగాలని కోరారు.
న్యూశాయంపేట : జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాకవి కాళోజీ నారాయణరావు 104వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్‌ఖాన్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళోజీ తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చారని అన్నారు. ఆయన వరంగల్ వాసి అయినందుకు అందరం గర్వపడాలని అన్నారు. నిజాం పాలకులకు వ్యతిరేకంగా గొంతెత్తి నినదించారని అన్నారు. నా గొడవతో నిర్మొహమాటంగా పాలకులను అక్షరరూపంగా వ్యతిరేకించిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది సంగ వేల్పుకొండయ్య, సుధాకర్‌రెడ్డి, పురుషోత్తం, వీణ, ప్రసన్న, నిర్మల, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

197
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...