ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలి


Mon,September 10, 2018 03:23 AM

-తాజా మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
-నగరంలో 5కే రన్
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 09: ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉంటూ జీవితాన్ని ప్రశాంత వాతావరణంలో గడపాలని తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు ఆదివారం ర్యాలీ (5కె రన్ ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి సమస్యలనైనా ఆత్మహత్యలతో పరిష్కరించలేమని, సమన్వయంతో ముందు కు వెళ్తే అనుకున్నది సాధించవచ్చని అన్నారు. మార్పులను ఆస్వాదిస్తూ ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పోరాడి సాదించుకున్న తెలంగాణలో ఆత్మహత్యలు ఉండవద్దని ఆయన కోరారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య, పోటీతత్వం ముఖ్యమన్నారు. విద్యార్థులు సరైన సమయంలో కౌన్సెలింగ్, వైద్యుల సలహాలు తీసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో విశ్రాంత ఆర్‌ఎంవో డాక్టర్ బందెల మోహన్‌రావు, కార్పొరేటర్ బయ్యా స్వామి, ఓదెల కుమార్, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, కే నాగేశ్వర్‌రావు, డాక్టర్ శివసుబ్రమణ్యం, వరంగల్ సైకియాట్రీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ వై.యెర్ర శ్రీధర్‌రాజు, సెక్రటరీ డాక్టర్ పి.మన్‌మోహన్‌రాజు, ట్రెజరర్ డాక్టర్ బి.జగదీష్‌బాబు, డాక్టర్ రజా మాలిక్ ఖాన్, డాక్టర్ వశిష్ట పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...