-ఆసక్తిగా తిలకిస్తున్న భవన నిర్మాణదారులు
-వరంగల్లో ఏర్పాటు చేయడం సంతోషదాయకం : నిట్ డైరెక్టర్ రమణారావు
మట్టెవాడ, సెప్టెంబర్ 08: భవన నిర్మాణదారులకు మరింత పరిజ్ఞానాన్ని అందించే క్రమంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ రంగ ఉత్పత్తుల ప్రదర్శన(బిల్డ్ ఎక్స్ పో)-2018ను శనివారం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణారావు ప్రారంభించారు. అసోషియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్(ఇండియా)కరీంనగర్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్ ఫో -2018ని భవన నిర్మాణదారులు, బిల్డర్స్, సివిల్ ఇంజినీర్స్, ఇంజినీరింగ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకించారు. హైదరాబాద్ తర్వాత వరంగల్లో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 85 ప్రముఖ కంపనీలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో భవన నిర్మాణాలకు సంబంధించిన స్టీల్, సిమెంట్, టైల్స్, విద్యుత్ కేబుల్స్, పైపులు, పెయింట్స్, సానిటరీ ఐటమ్స్ లాంటి ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. నూతన టెక్నాలజితో ప్రస్తుత పరిస్థితులు, వాతావరణానికి అనుగుణంగా తయారు చేసిన వస్తువులను ప్రజలకు వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ రమణారావు మాట్లాడుతూ నిర్మాణ రంగంలో ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. విశిష్ట అథితిగా పాల్గొన్న ఇండియా కన్సల్టింగ్ సివిల్ ఇంజినీర్స్ అసోషియేషన్ జాతీయ అధ్యక్షుడు రత్నవేలు పాల్గొని వరంగల్ ప్రజలకు మంచి పరిజ్ఞానాన్ని అందించేలా ఈ ప్రదర్శను ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఈ ప్రదర్శనలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సివిల్ ఇంజినీర్స్ దాదాపు 350 మంది తిలకించారు. ఈ ప్రదర్శన ఆదివారం రాత్రి 9గంటల వరకు ఉంటుందని ఎక్స్ ఫో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నల్ల లక్ష్మయ్య, కో చైర్మన్ కోలా అన్నారెడ్డి తెలిపారు. ఈ ప్రదర్శనకు మహ్మద్ ఇదాయత్ అలీ, పాక పవన్కృష్ణ, ఈగల రాజేందర్, అర్ర అంబదాస్తో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. శనివారం ఒక్క రోజే ప్రదర్శనను దాదాపు 25వేల మంది తిలకించినట్లు నిర్వాహకులు తెలిపారు.