రికార్డు స్థాయాలో రక్తసేకరణ


Sun,September 9, 2018 03:23 AM

-2017లో 1029 యూనిట్లు
-2018లో 1289 యూనిట్లు
అర్బన్ కలెక్టరేట్, సెప్టెంబర్ 08 : వరంగల్ జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ స్థాపించిన 16 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా శనివారం నిర్వహించిన మెగా రక్తదానం శిబిరంలో రికార్డు స్థాయిలో రక్త సేకరణ జరిగిందని సొసైటీ చైర్మన్ డాక్టర్ పీ విజయచందర్‌రెడ్డి తెలిపారు. పరకాల తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా విష్ణుప్రియ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన మెగా రక్తదానం శిబిరంలో ఒకే రోజులో 1289 యూనిట్ల రక్తం సేకరించినట్లు తెలిపారు. గత సంవత్సరం ఇదే రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో 1029 యూనిట్లు సేకరించామని, ఈ సారి రికార్డు స్థాయిలో రక్తం సేకరించినట్లు వివరించారు. ఈ మెగా రక్తదానం శిబిరానికి వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సిబ్బంది, ఐఎంఏ, కేఎంసీ వైద్య విద్యార్థులు, ఎంజీఎం స్టాఫ్‌తోపాటు మంచిర్యాల, జనగాం బ్లడ్ బ్యాంకుల నుంచి, వర్థన్నపేట, మహబూబాబాద్ బ్లడ్ స్టోరేజీ సెంటర్ల నుంచి సుమారు 200 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఈ మేరకు ఇందులో పాల్గొన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి రెడ్ క్రాస్ భవనంలో సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా రక్తదాతలకు, కేఎంసీ ప్రిన్సిపాల్, ఎంజీఎం సూపరింటెండెంట్లకు రెడ్‌క్రాస్ సొసైటీ పాలక వర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ట్రెజరర్ ఎం నాగయ్య, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యుడు ఈవీ శ్రీనివాస్, జిల్లా సభ్యులు చెన్నమనేని జయశ్రీ, ఐఎంఏ అధ్యక్షుడు ఎం సుదీప్, రెడ్‌క్రాస్ డాక్టర్లు ఎస్ రాంకిషన్, జీ ప్రభాకర్‌రావు, డాక్టర్ పోలిరెడ్డి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

195
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...