కొండా సురేఖకు రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆరే..


Sun,September 9, 2018 03:22 AM

-కుటిల రాజకీయాలకు కేరాఫ్ కొండా దంపతులు
-రెండేళ్లుగా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నది నిజం కాదా?
-టీఆర్‌ఎస్‌లో కోటరీలుండవు.. అధినేతే మా బాస్..
-తూర్పు ప్రజల అభీష్టం మేరకే పెండింగ్‌లో టికెట్
-కొండా సురేఖపై మేయర్ నన్నపునేని నరేందర్ ఫైర్
వరంగల్/సుబేదారి, నమస్తే తెలంగాణ : రాజకీయంగా భూస్థాపితమయ్యే రోజుల్లో కొండా సురేఖకు టికెట్ ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆర్ అని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. టీఆర్‌ఎస్‌లో కోటరీలు ఉండవని.. అధినేత సీఎం కేసీఆరే తమకు బాస్ అని, ఆయన ఆదేశాలే తమకు శిరోధార్యమని వరంగల్ కార్పొరేషన్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం ఆయన హన్మకొండలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ పార్టీపై తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. రాజకీయంగా పునర్జన్మనిచ్చిన సీఎం కేసీఆర్‌పై విమర్శలా అంటూ కొండా సురేఖపై ఆయన ఫైర్ అయ్యారు. త్యాగాల పునాదులు, కార్యకర్తల అంకితభావంపై నిర్మితమైన టీఆర్‌ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేసే సహించేది లేదని హెచ్చరించారు. కుటిల రాజకీయాలకు కొండా దంపతులు కేరాఫ్ అని ఆయన విమర్శించారు. సోదరభావంతో హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు కొండా సురేఖ కుట్రలు చేశారన్నారు. స్వార్థ రాజకీయాలు తప్పా ప్రజా సేవ చేసే లక్షణాలు కొండా దంపతులకు లేవని ఆయన ఘాటుగా విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేను చేస్తే తాను పార్టీకి , ప్రజలకు ఏం సేవ చేశారో ఒక్క సారి కొండా సురేఖ ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉంటూ అదే పార్టీకి ద్రోహం చేస్తూంటే చూస్తూ ఊరుకోమని అయన అన్నారు.

కాంగ్రెస్‌తో టచ్‌లో ఉంది నిజం కాదా..
రెండేళ్లుగా కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నది నిజం కాదా అని మేయర్ నరేందర్ సూటిగా ప్రశ్నించారు. ఉదయం ఉత్తమ్‌కుమార్‌రెడ్దితో, పగలు ప్రగతి భవన్‌కు చక్కర్లు కొట్టింది తూర్పు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. కొండా దంపతుల డబుల్ గేమ్ చూసిన నియోజకవర్గ ప్రజలు వారిని రెండేళ్ల నుంచే తిరస్కరించారని ఆయన అన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాల మేరకు కేసీఆర్ టికెట్ పెండింగ్‌లో పెట్టారని అన్నారు. కొండా సురేఖ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిని మరిచి పక్క పార్టీల వైపు చూసింది నిజం కాదా అని ఆయన అన్నారు. ప్రజాప్రతినిధులను, కార్యకర్తలు, ప్రజలను అవమానించిడం కొండా దంపతుల నైజం అన్నారు. భయపడే రోజులు పోయాయని, ఆకురౌడీల కాలం కాదని, ఇది ఆన్‌లైన్ కాలమని ఆయన అన్నారు. భూపాలపల్లిలో మధుసూదనచారిని గెలిపించింది తామే అని చెప్పుకుంటున్న కొండా దంపతులు సొంత నియోజకవర్గం పరకాలలో పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపించలేదో తెలపాలని ఆయన ప్రశ్నించారు.

సురేఖ ఏమైనా పార్టీ సుప్రీమా..?
టీఆర్‌ఎస్ పార్టీకి కేసీఆర్ సుప్రీం అని ఆయన ఆదేశాల మేరకే పార్టీ పనిచేస్తుందని మేయర్ నరేందర్ అన్నారు. భూపాలపల్లిలో మధుసూధనచారి పనితీరు బాగాలేదు, కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తున్నా అని చెప్పడానికి కొండా సురేఖ పార్టీ సుప్రీమా అని ఆయన అన్నారు. కార్యకర్తలతో కాళ్లు మొక్కించుకొని అవమానించే సంస్కృతి కొండా దంపతులదని అయన మండిపడ్డారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు కొండా సురేఖ తీరుతో విసిగిపోయారన్నారు. రాబోయే ఎన్నికలో ఎక్కడి నుంచి ప్రజాక్షేత్రంలో నిలిచినా డిపాజిట్ దక్కకుండా ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి టీఆర్‌ఎస్‌కు కంచుకోటలు అన్నారు. ఆంధ్ర పాలకులను తరిమికొట్టిన శక్తి టీఆర్‌ఎస్ కార్యకర్తలదని అన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే మరోసారి మానుకోట ఘటన పునారావృతం అవుతుందని ఆయన హెచ్చంచారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు యెలగం లీలావతి, రీజ్వానా షమీమ్, బిల్ల కవిత, కుందారపు రాజేందర్, వీర్ల భిక్షపతి, మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, కొప్పుల శ్రీనివాస్, బత్తిని వసుంధర, టీఆర్‌ఎస్ నాయకులు శామంతుల శ్రీనివాస్, మసూద్, వస్కుల బాబు, బిల్లా శ్రీకాంత్, యెలగం సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

178
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...