వైద్యరంగంలో పెథాలజిస్టుల పాత్ర కీలకం


Sun,September 9, 2018 03:22 AM

-పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సి ఉంది..
-యూనివర్సిటీ తరపున రీసెర్చ్‌కు ప్రోత్సాహం
-కాళోజీ హెల్త్‌వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 08: వైద్యరంగంలో పెథాలజిస్టుల పాత్ర కీలకమని కాళోజీ నారాయణరావు హెల్త్‌వర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి అన్నారు. మూడో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పెథాలజిస్ట్స్ అండ్ మైక్రోబయోలజిస్ట్స్ తెలంగాణ స్టేట్ చాప్టర్ కాన్ఫరెన్స్ కాకతీయ వైద్య కళాశాల ఎన్‌ఆర్‌ఐ భవనంలో శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీసీ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రోగులకు వైద్య సేవల్లో భాగంగా సర్జరీ విభాగానికి పెథాలజీ డిపార్ట్‌మెంట్‌కు అనుసంధానం ఉంటుందన్నారు. పేషెంట్లకు ఆపరేషన్ ముందు, తర్వాత పాథాలజి రిపోర్టు మీద ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. అయితే ఈ వైద్య పరీక్షలపై పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. రీసెర్చ్‌పై విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం వల్ల ప్రపంచంలో తగిన గుర్తింపు రావడం లేదని తెలిపారు. వ్యాధి నిర్దారణ పరీక్షల్లో అధునాతన పద్దతులు ఉపయోగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పెథాలజిస్టులు అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకు వెళ్లాలని వీసీ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వ్యాధుల నిర్ద్ధారణపై పరిశోధనల కోసం కోట్లాది రూపాయాలు మంజూరు చేస్తోందన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలతో విద్యార్థులు రీసెర్చ్‌పై దృష్టి సారించాలని వివరించారు. ఇందుకు అవసరమైన వసతులను కల్పిస్తామని, అన్ని డిపార్ట్‌మెంట్లతో కలిపి సీఎంఈ ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాళోజీ యూనివర్సిటీ తరుపున రీసెర్చ్‌కు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని కరుణాకర్ రెడ్డి వివరించారు. పదకొండేళ్ల తర్వాత ఇలాంటి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. సదస్సులో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ బీ శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అనిల్, కమిటీ సెక్రటరీ డాక్టర్ ఎండీ అన్వన్ మియా, పెథాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ డాక్టర్ లోకేశ్‌రావు, ఇండియన్ పెథాలజీ అసోసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏజీహిల్ హర్సిని, సెక్రెటరీ డాక్టర్ తమిల్ హర్సిని, డాక్టర్ కే సుశీల, డాక్టర్ కే రాజ్‌కుమార్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ వందన, డాక్టర్ హేమదత్త్, డాక్టర్ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల వ్యాధుల నివారణ పద్దతులపై పలువురు పేపర్ ప్రజెంటేషన్ చేశారు. వ్యాధులు, నివారణ పద్దతులపై ైస్లెడ్ షో నిర్వహించారు.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...