ప్రెస్ వాహన స్టిక్కర్లను ఆవిష్కరించిన సీపీ


Sun,September 9, 2018 03:21 AM

నయీంనగర్,సెప్టెంబర్08 : ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన వాహన స్టిక్కర్లను శనివారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ రవీందర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రెస్‌క్లబ్ సభ్యులు హైసెక్యూరిటీ స్టిక్కర్లు రూపొందించడం అభినందనీయమని, ప్రతీ జర్నలిస్టు విధిగా వాహనాలపై అంటించుకొవడం వల్ల తనిఖీల సమయంలో జర్నలిస్టులను గుర్తించడం సులభం అవుతుందన్నారు. తనిఖీల సమయంలో ప్రెస్‌క్లబ్ జారీ చేసిన స్టిక్కర్లు కలిగి ఉన్న వాహనాలను మాత్రమే వదిలిపెట్టడం జరుగుతుందన్నారు. జర్నలిస్టు కాని వారు ఏవరైనా ప్రెస్‌క్లబ్ స్టిక్కరుతో వాహనం నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నకిలీ స్టిక్కర్లు తయారు చేయకుండా ప్రెస్‌క్లబ్ లోగోతో కూడిన హోలోగ్రాంను స్టిక్కర్లపై ఏర్పాటు చేయడం జరిగిందని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ జారీ చేసిన స్టిక్కరు కలిగి ఉన్న జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని సీపీని శ్రీధర్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ కార్యదర్శి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు, టీయూడబ్ల్యూజే అర్బన్, రూరల్ అధ్యక్షులు కృష్ణగోవిందు, రవీందర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...